AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెన్షన్ పేరులో వృద్ధురాలిని మోసం చేసిన గ్రామ వాలంటీర్‌.. ఆస్తికే ఎసరు.. సినిమాను మించిన ట్విస్టులు

భార్యభర్తల మధ్య విభేదాలు..భర్త ఆస్తికోసం ఓ ప్రజాప్రతినిధి ఆడిన ఆటలో పావుగా మారిన గ్రామ వాలంటీర్‌.. ఏకంగా 30లక్షల ఆస్తిని కాజేసేందుకు స్కెచ్‌. సినిమా ట్విస్టులను మించిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Andhra Pradesh: పెన్షన్ పేరులో వృద్ధురాలిని మోసం చేసిన గ్రామ వాలంటీర్‌.. ఆస్తికే ఎసరు.. సినిమాను మించిన ట్విస్టులు
Volunteer Cheating
Ram Naramaneni
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 24, 2022 | 10:46 AM

Share

పెన్షన్‌ పేరుతో వృద్ధురాలిని నమ్మించాడో గ్రామ వాలంటీర్‌. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తికే ఎసరు పెట్టాడు. అయితే.. ఆ వాలంటీరు వెనుక అధికార పార్టీ నేత హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా( East godavari district) కాకినాడ(Kakinada) రూరల్‌ చీడిగలో ఓ వృద్ధురాలిని పెన్షన్‌ పేరుతో మోసం చేశాడు వాలంటీర్‌ రవికుమార్‌. వాశంశెట్టి మంగాయమ్మ అనే వృద్ధురాలితో అగ్రిమెంట్‌ స్టాంప్‌ పేపర్లపై వేలిముద్రలు వేయించుకున్నాడు. ఏకంగా 30 లక్షల రూపాయల ఆస్తిని కాజేసేందుకు స్కెచ్‌ వేశాడు. 45 రోజుల తర్వాత మంగాయమ్మ చిన్న కోడలు సత్యవేణి పేరుతో లాయర్‌ నోటీసు రావడంతో వాలంటీర్‌ బండారం బయటపడింది. మంగాయమ్మకు అందిన నోటీసులో 30లక్షల రూపాయల ఆస్తిని సత్యవేణికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. అప్పటికే 25 లక్షలు చెల్లించినట్లు ఉంది. మిగతా ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఆస్తిని సత్యవేణి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయాలని నోటీసులో ఉండడంతో నివ్వెరబోయింది మంగాయమ్మ. ఎంపీటీసీగా ఉన్న సత్యవేణి, విశ్వనాథం దంపతులు. విభేదాలతో కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది సత్యవేణి. రాజకీయ అండతోనే ఆస్తిని కాజేయాలని చూస్తోందని ఆరోపించారు మంగాయమ్మ కొడుకు విశ్వనాథం. గ్రామ వాలంటీర్‌ రవికుమార్‌తో.. అమాయకురాలైన తన తల్లి మంగాయమ్మ నుంచి వేలిముద్రలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆ విషయం నోటీసులు వచ్చేదాక తెలియకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించారు. న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు మంగాయమ్మ ఆమె కొడుకు విశ్వనాథం.

Kkd Valenteer Mosam Story Bytes-1

Also Read: మీరు తినే మాంసం వెనుక భారీ మోసం.. ఈ విషయం తెలుసుకోకపోతే మీరు అయిపోయినట్లే

ఎండు మిర్చి మాత్రమే కాదు.. పచ్చి మిర్చి కూడా దుమ్ములేపుతుంది.. కేజీ ఎంతో తెలుసా..?