Andhra Pradesh: మీరు తినే మాంసం వెనుక భారీ మోసం.. ఈ విషయం తెలుసుకోకపోతే మీరు అయిపోయినట్లే
మీరు తినే మాంసంలో నాణ్యత గమనించారా? అసలు తూకం సరిగా ఉందో? లేదో పరిశీలించారా? మున్సిపల్ అధికారులు జరిపిన దాడుల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి.
Vizianagaram district: మాంసం వెనుక కూడా మోసం దాగి ఉందని ఎప్పుడైనా గమనించారా ? మీరు భుజించే మాంసం శుభ్రంగా ఉంటోందా ? లేదా కుళ్లిపోయి ఉంటోందా? ఎప్పుడైనా గమనించారా ? లేదంటే ఈసారి మార్కెట్‌కి వెళ్లినపుడు ఒకసారి పరిశీలించండి. లేదంటే కుళ్లిపోయిన మాంసాన్ని మీకు అంటగట్టే ప్రమాదం ఉంది. దాని వల్ల కొత్త రోగాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలో మున్సిపల్ అధికారులు జరిపిన దాడుల్లో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా సాలూరు(Salur)లో మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు మునిసిపల్ అధికారులు.. నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు జరిపారు అధికారులు. ఈ తనిఖీల్లో సుమారు 46 కేజీల కుళ్ళిన మాంసం బయటపడింది. దీంతో కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న రెండు దుకాణాల పై కేసులు నమోదు చేసి ఇరవై వేల జరిమానా విధించారు. మునిసిపల్ అధికారి శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మునిసిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
మాంసం విక్రయాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తాము జరిపిన తనిఖీల్లో తూనికల్లో కూడా తేడాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: ఎండు మిర్చి మాత్రమే కాదు.. పచ్చి మిర్చి కూడా దుమ్ములేపుతుంది.. కేజీ ఎంతో తెలుసా..?
Telangana: సామాన్యుడికి మరో షాక్.. విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే..?