Telangana: సామాన్యుడికి మరో షాక్.. విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే..?

సామాన్యుడికి మరో షాక్.. తెలంగాణలో కరెంట్ చార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ నుంచి మోత మోగనుంది. భారీ ద్రవ్యలోటుతో డిస్కంలు కొట్టుమిట్టాడుతుండటంతో పెంపు తప్పడం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Telangana: సామాన్యుడికి మరో షాక్.. విద్యుత్ చార్జీల పెంపు.. యూనిట్‌కు ఎంతంటే..?
Electricity Bill
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2022 | 10:08 AM

ఇప్పటికే నిత్యావసరాల ధరలు.. పెట్రోల్‌(Petrol), డీజిల్‌(Diesel), గ్యాస్ రేట్లు సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతున్నాయి. ఇప్పుడు వాటికి కరెంట్‌ బిల్లులు(Power Bill) కూడా తోడయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. భారీ ద్రవ్యలోటుతో డిస్కంలు కొట్టుమిట్టాడుతుండటంతో తప్పడం లేదని స్పష్టం చేస్తోంది. పెరిగిన రేట్లు ఏప్రిల్ ఫస్ట్‌ నుంచి అమల్లోకి రానున్నాయి. సామాన్యులు 50 యూనిట్లలోపు కరెంట్ వాడితో ఇప్పటిదాకా అన్ని చార్జీలతో కలిపి 87 రూపాయల బిల్లు వచ్చేది. పెరిగిన రేట్లతో ఆ మొత్తం 132 రూపాయల 41 పైసల బిల్లు రానుంది. అంటే దాదాపు 40 రూపాయల బిల్లు అదనంగా వస్తుందన్నమాట. వంద యూనిట్లలోపు వాడే వాళ్లకి కూడా పిడుగు లాంటి వార్తే ఇది. 99 యూనిట్లు వాడే వాళ్లకి ఇప్పటిదాకా 286 రూపాయల బిల్లు వస్తే ఇప్పుడా మొత్తం 361కి చేరుకోనుంది. అంటే.. 75 రూపాయలు అదనంగా చెల్లించాలన్నమాట.

400 యూనిట్లపైన కరెంట్ వాడే వినియోగదారులకు తడిసి మోపెడు కానుంది. 3,500లు వచ్చే బిల్లుకి మరో రెండు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే డెవలప్‌మెంట్‌ చార్జీలతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు చార్జీల బాదుడుతో తలలు పట్టుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకుని జనమంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో వరుస బాదుడు సామాన్య జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాలకు విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించగా ఈఆర్‌సీ నో చెప్పింది. కుటీర పరిశ్రమలకు, వ్యవసాయ పంపు సెట్లకు చార్జీలు పెంచలేదు.

Also Read: లేటైనా అదరగొట్టేసింది.. శ్రీవల్లి పాటకు విద్యాబాలన్‌ స్టెప్పులు . వైరలవుతోన్న వీడియో..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?