Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Viral Video: ఎలుక పిల్లికి ఆహారం.. పిల్లి కుక్కకు ఆహారం.. ఇది ప్రకృతి నియమం. అయితే.. పిల్లి, కుక్క మధ్య శత్రుత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో..

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2022 | 7:59 PM

Viral Video: ఎలుక పిల్లికి ఆహారం.. పిల్లి కుక్కకు ఆహారం.. ఇది ప్రకృతి నియమం. అయితే.. పిల్లి, కుక్క మధ్య శత్రుత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. పొరపాటున గనుక పిల్లి.. కుక్కకు చిక్కితే అదే దానికి చివరి రోజు అవుతుంది. గుటుక్కన మింగేస్తుంది. అందుకే కుక్క నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతుంది. అయితే, కొన్ని పెంపుడు కుక్కలు, పిల్లులు కలిసే ఉంటాయి. అలా కలిసి ఉన్న పెంపుడు పిల్లులు, కుక్కలు చేసే అల్లరి పీక్స్‌లో ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో లో ఎలుక, పిల్లి కొట్టుకున్నట్లుగా.. పిల్లులు, కుక్కలు గేమ్స్ ఆడుతాయి. ఒకదానిని మరొకటి ఆటపట్టిస్తాయి. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ఇంట్లో రెండు పెంపుడు పిల్లులు, ఒక కుక్క ఉంది. అవి చాలా సరదాగా ఉంటాయి. అయితే, ఇంట్లో ఉన్న ప్లవర్ వేస్‌తో ఓ పిల్లి సరదాగా ఆడుకుంటుకుండగా.. పక్కనే కుక్క, ఆ వెనుక మరో పిల్లి ఉన్నాయి. అయితే, నిల్చోబెట్టిన ఫ్లవర్ వేస్‌ను కింద పడేసింది పిల్లి. దాంతో పెద్దగా శబ్ధం వచ్చింది. దెబ్బకు బెదిరిపోయిన పిల్లులు.. తమకేమీ తెలియదన్నట్లుగా అక్కడి నుంచి పారిపోయాయి. పాపం కుక్క మాత్రం దానిని చూస్తూ అలాగే ఉండిపోయింది. ఈ సీన్ అంతా అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డ్ చేశారు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సమ్రత్ గౌడ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పిల్లి కంత్రీ చేష్టలకు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. వీడియోకు వేలాది వ్యూస్, లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

RUSSIA TO END WAR: యుద్దాన్ని విరమించనున్న రష్యా.. ముహూర్తం ఖరారు చేసిన పుతిన్.. ఈలోగా టార్గెట్ ఇదే!

Viral: ఇదేంది టీచర్ గారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే