AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: పాటలతోనే రికార్డుల వేట మొదలుపెట్టిన `సర్కారు వారి పాట`..

మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందట ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. మహేష్ బాబు సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫాన్స్

Sarkaru Vaari Paata: పాటలతోనే రికార్డుల వేట మొదలుపెట్టిన `సర్కారు వారి పాట`..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2022 | 11:37 AM

Sarkaru Vaari Paata: మహేష్ బాబు(Mahesh Babu)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా వస్తుందట ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు. మహేష్ బాబు సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫాన్స్. మహేష్  సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సర్కారు వారి పాట సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఆమధ్య విదులైన `కళావతి` పాట న్యూ రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు దక్కదని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

కళావతి సాంగ్ లో ప్రేమ, చ‌క్క‌టి భావోద్వేగం క‌లిగివున్నాయి. అందుకే విడుదలైన కొద్దిసేపటికే అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో నిలిచి శ్రోత‌ల‌ హృదయాలను దోచుకుంటూనే ఉంది. ఈ బ్లాక్‌ బస్టర్ పాట ఇప్పటివరకు 1.7 మిలియన్ లైక్‌ లతో 100 మిలియన్ల వ్యూస్‌ను అధిగమించింది. ఫాస్టెస్ట్ గా మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే మైలురాయిని చేరుకున్న మొదటి సింగిల్‌గా ఈ పాట నిల‌వ‌డం విశేషం. S థమన్ అద్భుతమైన ఆర్కెస్ట్రా తో చ‌క్క‌టి ఫీల్‌ను క‌లిగించేలా బాణీలు స‌మ‌కూర్చాడు. సిద్ శ్రీరామ్ మరోసారి తన మ‌ధుర‌మైన‌ గానంతో పాట‌కు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం స‌మ‌కూర్చారు. మహేష్ బాబు తన స్టైలిష్ లుక్స్, ఆక‌ట్టుకునే హావ‌భావాల‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు, కీర్తి సురేష్ ఇందులో చాలా అందంగా కనిపించింది. ఇక ఈ చిత్రం నుంచి వ‌చ్చిన‌ రెండవ సింగిల్ `పెన్నీ` కూడా అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. సితార ఘట్టమనేని నటించిన ఈ పాట వైరల్‌గా మారింది. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఇప్పటికే ఈ పాట 21 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. మొదటి రెండు పాటలు విజయం సాధించడంతో సినిమా తదుపరి పాటలపై ఆసక్తి పెరిగింది. పాటలతోనే రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదలైన తర్వాత ఇప్పటివరకు ఉన్న రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాతో ఈసారి బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం అంటున్నారు అభిమానులు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్కారు వారి పాట మే 12న వేసవి కానుక‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhanu Shree: కైపెక్కిస్తున్న అందాలతో మెస్మరైజ్ చేస్తున్న భాను లేటెస్ట్ పిక్స్ వైరల్

Aparna Balamurali: నాట్య మయూరి గా మారిన అపర్ణ బాలమురళి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

RRR: దద్దరిల్లుతున్న RRR థియేటర్లు… రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్