Pooja Hegde: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెడుతున్న బుట్టబొమ్మ.. మరోసారి ఆ కుర్ర హీరోతో..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య  నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ పూజాహెగ్డే.

Pooja Hegde: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో పెడుతున్న బుట్టబొమ్మ.. మరోసారి ఆ కుర్ర హీరోతో..
Pooja Hegde
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2022 | 9:36 AM

Pooja Hegde: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ పూజాహెగ్డే. తొలి సినిమాలో అమాయకంగా పక్కింటి అమ్మాయిలా కనిపించి కవ్వించింది ఈ సుందరి. దాంతో ఈ చిన్నదానికి తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తక్కువ సమయంలోనే పూజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అరడజను కు పైగా సినిమాలున్నాయి. ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో హోమ్లీగా కనిపించిన పూజా ఆతర్వాత రెచ్చిపోయింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన డీజే సినిమాలో ఏకంగా బికినీలో కనిపించి కవ్వించింది. తెలుగులో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంది. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలన్నీ బడా మూవీసే..

ఇటీవలే తమిళ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బీస్ట్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇక తెలుగులో పూజ నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలోనూ పూజా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. మరోసారి నాగచైతన్య కు జోడీగా ఈ అమ్మడు నటించనుందట. తెలుగు.. తమిళ భాషల్లో వెంకట్ ప్రభు రూపొందించనున్న సినిమాలో ఈ జంట మరోసారి కనువిందు చేయనుంది. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు తెలియనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhanu Shree: కైపెక్కిస్తున్న అందాలతో మెస్మరైజ్ చేస్తున్న భాను లేటెస్ట్ పిక్స్ వైరల్

Aparna Balamurali: నాట్య మయూరి గా మారిన అపర్ణ బాలమురళి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

RRR: దద్దరిల్లుతున్న RRR థియేటర్లు… రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే