Akhilesh Yadav: యూపీ ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్.. ఎస్పీ సమావేశంలో కీలక నిర్ణయం..
UP Opposition Leader: సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్పీ శాసనసభపక్షనేతగా, ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎస్పీ
UP Opposition Leader: సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్పీ శాసనసభపక్షనేతగా, ప్రతిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఎస్పీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులందరితో జరిగిన సమావేశంలో ఈ మేరకు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ శాసనసభా పక్ష నేతగా అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని.. ప్రతిపక్షనేతను ఎన్నుకునే ప్రక్రియ అసెంబ్లీలోనే జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ శనివారం పేర్కొన్నారు.
కాగా.. అఖిలేష్ యాదవ్ ఇప్పటికే లోక్‌సభకు రాజీనామా చేస్తూ.. స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆయన లోక్‌సభకు అజంగఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన తరువాత అఖిలేష్ లోక్‌సభకు రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే.. ఆయనతోపాటు ఎస్పీకి చెందిన ఆజంఖాన్ కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా లోక్‌సభకు రాజీనామా చేశారు. దీంతో వీరిద్దరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన తర్వాత పార్టీ బలం మూడుకు తగ్గనుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలను కైవసం చేసుకుంది. 2017లో 47 స్థానాలు మాత్రమే గెలుచుకోగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ సీట్లు పెరిగాయి.
కాగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యానాధ్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం యూపీ సీఎంగా యోగి రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: