Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh : ఏడేళ్ల కూతురు మృతదేహన్ని భుజాన మోస్తూ.. 10 కిలోమీటర్లు నడిచిన కన్న తండ్రి

చనిపోయిన తన ఏడేళ్ల కూతురిని భుజాలపై మోస్తూ 10 కిలోమీటర్లు కాలినడకన తన ఇంటికి తీసుకెళ్లిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

Chhattisgarh : ఏడేళ్ల కూతురు మృతదేహన్ని భుజాన మోస్తూ.. 10 కిలోమీటర్లు నడిచిన కన్న తండ్రి
Viral Photo
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2022 | 1:24 PM

Officials Negligence: ఆధునిక కాలంలో అంతరిక్షంలో విహరించే స్థాయికి ఎదిగాం.. వైద్య రంగంలో కృత్తిమ మేథస్సుతో శాసించే స్థాయిలో ఉన్నాం.. అయితే, పేదలకు కనీస వసతులు కల్పించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాం. ఉన్నవాడికి సకల వసతులు ఉన్నప్పటికీ.. లేనివారికి కనీస సదుపాయాలు కరవై దీనావస్థలతో కాలం వెల్లదీయాల్సి వస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి. అంబులెన్సులు లేక, సరైన సమయానికి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండక, వారి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ఉంది. ఆఖరికి అంబులెన్స్ లు కాదు కదా.. ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోతే వారిని ఇంటికి తరలించటానికి ‘అంతిమ యాత్ర’ వాహనాలు కూడా లేదు దుస్థితుల్లో ఉన్నాయి ప్రభుత్వ ఆస్పత్రులు. ఇటువంటి దారుణ దుస్థితే ఓ తండ్రికి ఎదురైంది. చనిపోయిన తన ఏడేళ్ల కూతురిని భుజాలపై మోస్తూ 10 కిలోమీటర్లు కాలినడకన తన ఇంటికి తీసుకెళ్లిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది..సుర్గుజా జిల్లాలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈ ఘటనపై ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ విచారణకు ఆదేశించారు.

ఛత్తీస్‌గ‌ఢ్‌లోని సుర్గుజా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ తండ్రికి దారుణ పరిస్థితి వచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు.. ఆ తండ్రి కళ్ల ముందే ప్రాణాలు విడిచింది.. ఆ దారుణ పరిస్థితి చూసిన ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది.. గుండెల్లోంచి పుట్టెడు దుఃఖం తన్నుకొచ్చింది.. గుండెలవిసేలా ఏడ్చాడు..శవాన్ని ఇంటికి తీసుకెళ్లటానికి సిద్ధమయ్యారు. వాహనం కోసం ఆస్పత్రి సిబ్బందిని అడిగాడు. లేదని చెప్పారు. బతిమాలాడు. కన్నీటితో వేడుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. దీంతో ఏడేళ్ల కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి భుజాలకెత్తుకున్నాడు.. దుఃఖాన్ని దిగమింగుకుని నడక మొదలెట్టాడు.. అలా.. అలా..ఒకటి రెండు కాదు ఏకంగా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి చేరాడు.. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం మార్చి 25న ఉదయం లఖన్‌పూర్ గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఒక బాలిక మరణించింది. అంబులెన్స్‌లో అక్కడికి చేరుకునేలోపే, బాలిక తండ్రి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడు. చనిపోయిన అమ్మాయి ఆమదాల గ్రామానికి చెందిన సురేఖ అని అధికారులు తెలిపారు. ఉదయం ఆమె తండ్రి ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న కుమార్తెను లఖన్‌పూర్ సీహెచ్‌సీకి తీసుకొచ్చాడు. బాలిక ఆక్సిజన్ లెవల్ దాదాపు 60గా ఉందని అధికారులు తెలిపారు. బాలికకు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ ఘటనపై ఆరోగ్య కేంద్రంలోని రూరల్ మెడికల్ అసిస్టెంట్ (ఆర్‌ఎంఏ) డాక్టర్ వినోద్ భార్గవ స్పందించారు. బాలికకు చికిత్స ప్రారంభించామని, అయితే అప్పటికే ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని, క్రమంగా క్షీణించిందని చెప్పారు. అదే సమయంలో, చికిత్స పొందుతూ, ఆమె శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మరణించిందన్నారు.

మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకవైపు పాలనా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. Read Also… MODI STORY: ఛాయ్‌వాలా నుంచి ప్రధాని దాకా మోడీ ప్రస్థానం.. పోర్టల్ ప్రారంభించిన మహాత్మా గాంధీ మనవరాలు