MODI STORY: ఛాయ్‌వాలా నుంచి ప్రధాని దాకా మోడీ ప్రస్థానం.. పోర్టల్ ప్రారంభించిన మహాత్మా గాంధీ మనవరాలు
ప్రధాని నరంద్ర మోడీ సంబంధించి స్టోరీని మహాత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రారంభించారు.
MODI STORY: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)కి మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. చాలా మంది సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అందరి మనసు దోచుకున్నారు నరేంద్రుడు. విదేశాలోనూ పీఎం మోడీకి మంచి క్రేజ్ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ ఉన్న నేతగానూ మోడీ కొనసాగుతున్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ(BJP)ని అద్భుతమైన మోజార్టీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. మోడీ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలతో రూపొందించి ఓ వీడియోను గుజరాత్ భారతీయ పార్టీ శాఖ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఆయన గుజరాత్ నుంచి మొట్ట మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అదే తరహాలో తొలి సారి ఎంపీగా ఎన్నికై భారత ప్రధాని పదవిని చేపట్టారు. 1984వ సంవత్సరం తర్వాత లోక్‌సభలో బీజేపీకి భారీ ఆధిక్యాన్ని తెచ్చిపెట్టిన ఘనత నరేంద్ర మోడీదే. గుజరాతీ అయిన మోడీ వాద్‌నగర్‌లో జన్మించారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తండ్రి టీ స్టాల్‌లో సాయం చేస్తూ ఆయన కూడా సొంతంగా మరో టీ స్టాల్ పెట్టుకున్నారు. ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడే ఆర్ఎస్ఎస్‌లో చేరి అక్కడి నుంచి అదే సంస్థతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత 1985వ సంవత్సరంలో బీజేపీలో చేరిపోయారు.
ప్రధాని నరంద్ర మోడీ సంబంధించి స్టోరీని మహాత్మా గాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ప్రారంభించారు.మోడీ జీవితంలోని స్పూర్తిదాయకమైన క్షణాలను ఒకచోట చేర్చేందుకు, అతని సహ-ప్రయాణికులు ఉన్నందుకు సుమిత్రా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ప్రధాని నరేంద్ర మోడీ జీవిత ప్రయాణంలో ఆయనతో సంభాషించిన వారి నుంచి ఆయనకు సంబంధించిన స్పూర్తిదాయకమైన కథనాలను సేకరించి modistory.in అనే పోర్టల్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ భారతీయ జనతా పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది..
Announcing the launch of MODI STORY, a volunteer driven initiative to bring together inspiring moments from Narendra Modi’s life, as narrated by his co-travellers.
Inaugurated by Smt.Sumitra Gandhi Kulkarni, granddaughter of Mahatma Gandhi.
Visit :https://t.co/9iulCa9s3h pic.twitter.com/Fra9Uzu8pj
— Modi Story (@themodistory) March 26, 2022
నరేంద్ర మోడీ ప్రస్థానం సాగిందిలా….
మోడీ ఆర్.ఎస్.ఎస్ లో పని చేస్తున్న సమయంలో నే ఆనాటి గుజరాత్ రాష్ట్ర జనసంఘ్ పార్టీ ముఖ్య నాయకులు నాథులాల్ ఝాగ్దా , వసంత్ భాయ్ గజేంద్రద్కర్ లతో ఏర్పడ్డ సన్నిహిత సంబంధాలు మోడీ ని రాజకీయాల పట్ల ఆకర్షితుడిని చేశాయి. 1986లో ఆర్.ఎస్.ఎస్ నుంచి బీజేపీలోకి ప్రవేశించిన మొదటి తరం నాయకుల్లో వీరు ఒకరు. బీజేపీలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల భాద్యతలు తీసుకొని పురపాలక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించి, బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిలో పడ్డాడు. అప్పటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీ ప్రోత్సాహం కూడా తోడై కొద్దికాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్ బాధ్యుడిగా, 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.
1998లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో పార్టీని విజయతీరాలకు చేర్చడంతో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000వ సమయంలో గుజరాత్‌లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబరులో నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి 2014 మే 21 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీనే కొనసాగారు.
- 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారు. అనంతరం రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
- 2014 నరేంద్రమోడీ 14వ ప్రధానిగా ఎన్నికై ప్రస్తుత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
- 26 మే 2014న నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
- భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వారిలో ప్రధానిగా ఎన్నికైన ప్రథముడు నరేంద్ర మోడీనే.
- 2012లో నరేంద్ర మోడీ నాలుగోవ సారి ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. 2014లో అసెంబ్లీకి రాజీనామా చేశారు.
- 2007 డిసెంబరు 23న మోడీ మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 20 డిసెంబరు 2012వరకూ కొనసాగారు.
- 2002 అసెంబ్లీ ఎన్నికలకు మణినగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.
- 2001 అక్టోబరులో నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం.
- 1995 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించారు.
- 1993లో బీజేపీ ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు చేపట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ జీవన ప్రయాణానికి సంబంధించి వీడియో మీకోసం….
Read Also….