Viral Video: తగ్గేదే లే అంటూ కొట్లాడిన పాములు.. చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటర్నెట్ అనేది కూడా మన జీవితంలో భాగం అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో అది మన అరచేతుల్లోని స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షం అవుతుంటాయి.
Viral Video: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటర్నెట్ అనేది కూడా మన జీవితంలో భాగం అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో అది మన అరచేతుల్లోని స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షం అవుతుంటాయి. ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు అలా అప్లోడ్ అవ్వగానే ఇలా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిజానికి ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తుంటాయి . పాములు చిన్న చిన్న జీవులను వేటాడి తినడం మనం చూశాం.. అదే రెండు పాములు కొట్లాడుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వీడియో అలాంటిదే..
ఈ వైరల్ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా, ఓ రాట్ స్నేక్ ట్టుకోవడం చూడవచ్చు. ఓ నల్లటి కింగ్ కోబ్రా కదలకుండా ఉన్న సమయంలో అక్కడికి ఓ రాట్ స్నేక్ వచ్చింది. మెల్లగా ఆ కింగ్ కోబ్రా ఆ పాము వైపు బుసలు కొడుతూ వెళ్తూ.. ఆ రెండింటి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఒకదాని పై ఒకటి దాడి చేసుకున్నాయి. మీరు ఇంతకు ముందు కింగ్ కోబ్రా ఇతర పాముల మీద దాడి చేయడం చూసి ఉంటారు. కానీ ఇది మాత్రం చాలా భయంకరంగా ఉంది. చివరకు కింగ్ కోబ్రానే గెలిచింది. రాట్ స్నేక్ ఆపెద్ద పాముతో చివని నిమిషం వరకు పోరాడింది కానీ ఫలితం లేకపోయింది. చివరకు ఆ కింగ్ కోబ్రాకు ఆహరం అయ్యింది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే ఏడేళ్ల క్రితం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 14,830,280 వీక్షణలు మరియు 9.5k లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :