AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azim Premji: హైదరాబాద్ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. 10 శాతం వాటా కొనుగోలు..

Azim Premji: ప్రముఖ వ్యాపారవేత్త విప్రో సంస్థ ఛైర్మన్ అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ కన్ను తెలంగాణలోని కంపెనీపై పడింది.

Azim Premji: హైదరాబాద్ కంపెనీపై అజీమ్ ప్రేమ్‌జీ కన్ను.. 10 శాతం వాటా కొనుగోలు..
Azim Premji
Ayyappa Mamidi
|

Updated on: Mar 26, 2022 | 2:02 PM

Share

Azim Premji: ప్రముఖ వ్యాపారవేత్త విప్రో సంస్థ ఛైర్మన్ అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ కన్ను తెలంగాణలోని కంపెనీపై పడింది. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన సాగర్‌ సిమెంట్స్‌లో(Sagar cements) 10.10 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ రూ.350 కోట్లుగా ఉంది. ప్రిఫరెన్షియల్‌(Preferential Shares) ప్రాతిపదికన రూ.2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.32 కోట్ల షేర్లను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ కొనుగోలు చేసింది. ఇందుకోసం ఒక్కో షేర్ కు రూ.265 చెల్లించింది. ఈ డీల్ ప్రతిపాదనకు సాగర్‌ సిమెంట్స్‌ బోర్డ్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది.

ప్రేమ్‌జీ సంస్థ డీల్‌ కారణంగా సాగర్‌ సిమెంట్స్‌ కంపెనీలో ప్రమోటర్ల వాటా 50.28 నుంచి 45.2 శాతానికి తగ్గింది. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని విస్తరణ, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించనున్నట్టు సాగర్‌ సిమెంట్స్‌ తెలిపింది. కార్యకలాపాలు, వ్యవస్థలను బలోపేతం చేయడం, వాటాదారులకు విలువను పెంపొందించడానికి ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సలహాల కోసం ఎదురుచూస్తున్నట్లు సాగర్‌ సిమెంట్స్‌ జేఎండీ అన్నారు. వృద్ధి లక్ష్యాలను చేరుకోవటానికి, దేశవ్యాప్త బ్రాండ్ గా మారేందుక ప్రస్తుత డీల్ ఎంతగానో ఉపకరిస్తుందని ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ పార్ట్‌నర్‌ రాజేశ్‌ రామయ్య తెలిపారు. ప్రస్తుతం సాగర్‌ సిమెంట్స్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 82.5 లక్షల టన్నులుగా ఉంది.

ఇవీ చదవండి..

ROCE: లాభాలను పొందడంలో ఏదైనా కంపెనీ సామర్ధ్యం ఎలా తెలుసుకోవాలి?

Tax Filing: మీరు ఉద్యోగం మారుతున్నారా.. అయితే ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి..