IPL 2022: క్రికెటర్ లవర్స్‌కి జియో గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్పెషల్ రీచార్జ్ ప్లాన్స్..
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమవుతోంది. చెన్నై టీం వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఫైట్ ప్రారంభం కానుంది...
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమవుతోంది. చెన్నై టీం వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఫైట్ ప్రారంభం కానుంది. దీంతో సినీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు సీజన్లపై కరోనా ప్రభావం పడగా.. ఈ సారి మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం లేకపోవడంతో భారత్‌లోనే మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుగా రిలయన్స్ జియో ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లలో ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుగా జియో రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది.
- జియో రూ. 555 పేరుతో కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. దీంతో వినియోగదారులు 55 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను పొందుతారు. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
- రూ. 499 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ వరకు డేటాను పొందొచ్చు. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
- రూ. 799, రూ. 1,006, రూ. 3,119 ప్లాన్స్‌తో యూజర్లు రోజుకు 2 జీబీ డేటాను పొందే అవకాశం ఉంది. అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం ఇచ్చారు.
- ఇక రూ. 2999 ప్లాన్‌తో ఏడాది పాటు రోజుకు 2.5 జీబీతో పాటు, డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
- రూ. 601 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా అలాగే ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
- రూ. 1499 రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటాతో పాటు ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తారు.
- రూ. 4,199 రీచార్జ్‌తో యూజర్లకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఏడాదికి గాను డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ పొందొచ్చు.
Also Read: PK Meet Rahul Gandhi: గుజరాత్‌పై గురి పెట్టిన కాంగ్రెస్.. రంగంలోకి పీకే.. రాహుల్‌తో కీలక భేటీ!
Heat wave: సమ్మర్ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలుస్తుంది.. నిప్పులు చిమ్మనున్న భానుడు
Accident: బైక్ పై నుంచి కిందపడి లేవబోతుండగా.. యువకుడి తలపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు