Jio IPL Plans 2022: ఐపీఎల్ 2022 కోసం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్.. రూ.279తో కిక్రెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్.!

Jio IPL Plans 2022: జియో వినియోగదారులకు ఇది శుభవార్త . వాస్తవానికి రిలయన్స్ జియో ఇటీవలే రూ. 300 కంటే తక్కువ ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ధర రూ...

Jio IPL Plans 2022: ఐపీఎల్ 2022 కోసం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్.. రూ.279తో కిక్రెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్.!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2022 | 2:53 PM

Jio IPL Plans 2022: జియో వినియోగదారులకు ఇది శుభవార్త . వాస్తవానికి రిలయన్స్ జియో ఇటీవలే రూ. 300 కంటే తక్కువ ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ధర రూ.279. ఇది కిక్రెట్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది డిస్నీ + హాట్‌స్టార్‌ (Disney+Hotstar)కి ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు డేటాతో పాటు OTT సభ్యత్వాన్ని పొందుతున్నారు. అయితే వాయిస్ కాల్‌ల ప్రయోజనం ఈ ప్లాన్‌లో చేర్చబడలేదు. కొత్త రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో 15 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇందులో మరో విశేషమేమిటంటే మీరు ఈ ప్లాన్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే, మీ ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది.

టెలికాం ఆపరేటర్ ఈ క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులందరికీ అందించడం లేదని గమనించాలి. ఇది ఎంపిక చేసిన వినియోగదారుల కోసం రూపొందించబడింది. కొంతమంది జియో వినియోగదారుల కోసం కంపెనీ నోటిఫికేషన్‌లను జారీ చేస్తోంది. మీరు కూడా జాబితాలో చేర్చబడితే మీరు కంపెనీ MyJio యాప్‌లో ఈ కొత్త ప్లాన్‌ కనిపిస్తుంటుంది.

కొత్త క్రికెట్ ప్లాన్ మీకు అందుబాటులో లేకుంటే మీరు రూ. 499 ప్రీపెయిడ్ జియో ప్లాన్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది జియో అతి తక్కువ ధర క్రికెట్ ప్లాన్. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అలాగే ఇది ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ కొనుగోలుపై, వినియోగదారులు 20 శాతం JioMart తగ్గింపు ఆఫర్‌ను కూడా పొందుతారు. కంపెనీ JioMart సర్వీస్ ద్వారా మీరు కొనుగోలు చేసే ఉత్పత్తులపై మీరు దాని ప్రయోజనాన్ని పొందుతారు.

దీనితో పాటు, మీరు మీ మొబైల్ నంబర్‌ను రీఛార్జ్ చేయకూడదనుకుంటే, IPL క్రికెట్ మ్యాచ్‌లను చూడటానికి మీకు అదనపు డేటా అవసరమైతే మీరు Jio యొక్క డేటా వోచర్‌ని ఉపయోగించవచ్చు. కంపెనీ 12GB డేటాను అందించే రూ. 121 విలువైన 4G డేటా వోచర్‌ను అందిస్తుంది. మీ ప్రస్తుత ప్లాన్ వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఎక్కువ డేటా అక్కర్లేని వారు రూ. 25 లేదా రూ. 61 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 2GB, 6GB డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ డేటా వోచర్‌లుగా పనిచేసే కొన్ని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. వీటిలో చౌకైనది రూ. 181 ప్రీపెయిడ్ డేటా ప్లాన్. ఇది మొత్తం 30GB డేటాతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లన్నీ MyJio యాప్‌లో అలాగే Jio సైట్‌లో ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!