Viral Video: పిడుగులాంటి చిన్నోడు.. పామును భయంతో పరుగులు పెట్టించాడు
పామును చూస్తే భయపడనివాళ్ళు ఎవరుంటారు. అలంత దూరాన కనిపిస్తేనే వణికిపోతాం.. అలాంటిది ఎదురుగా వస్తే ఇంకేమైన ఉందా.. కొంతమంది మాత్రం పాములంటే ఏమాత్రం భయం లేకుండా వాటిని పట్టుకోవడం
Viral Video: పామును చూస్తే భయపడనివాళ్ళు ఎవరుంటారు. అలంత దూరాన కనిపిస్తేనే వణికిపోతాం.. అలాంటిది ఎదురుగా వస్తే ఇంకేమైన ఉందా.. కొంతమంది మాత్రం పాములంటే ఏమాత్రం భయం లేకుండా వాటిని పట్టుకోవడం వాటితో ఆదుకోవడం వంటివి చేస్తుంటారు. అలాంటి వీడియోలు మనం నిత్యం నెట్టింట్లో చూస్తూనే ఉంటాం.. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుమారు 5 అడుగుల పొడవున్న పాముతో ఆటలాడుకున్నాడు ఓ బుడ్డోడు. ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. చిన్న పిల్లలు తెలుసి తెలియక ప్రమాదాలతో ఆటలాడుతూ ఉంటారు. కానీ ఈ బుడతడు మాత్రం అది పాము అని తెలిసి కూడా దానితో ఆటలాడాడు.
ఐదు అడుగుల పొడవైన ఓ పాము రోడ్డు పై వెళ్తూ కనిపించింది. ఇంతలో అది గమనించిన చిన్నపిల్లవాడు దాని దగ్గరకు వచ్చాడు. వచ్చిన వాడు ఊరికే ఉండక దాని తోకపట్టుకొని లాగాడు. దాంతో ఆ పాము భయపడి పోయింది. పాము విడిపించునే ప్రయత్నం చేసిన అతడు దాని తోక వదలలేదు. పామును వదలకుండా దాని తోక పట్టుకుని పిల్లవాడు లాగుతూ ఉన్నాడు. ఇంతలో ఆ పాము అతడి చేతిలో నుంచి తప్పించుకుంది. అయినా కూడా ఆపిల్లడు దాన్ని వెంబడించి దాని తోక పట్టుకునే ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తూ ఆ పిల్లాడిని పాము కాటు వేయలేదు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే వీడియోకి 15.8k పైగా వ్యూస్.. వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. ఈవీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :