Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Fraud Alert: మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోండి..

UPI Fraud Alert: మీరు రోజువారీ చెల్లింపులకోసం యూపీఐ యాప్ లను వినియోగిస్తున్నారా. సైబర్ మోసగాళ్లు ఈ తరహా మోసాలకు ఎక్కువగా పాల్పడుతూ అనేక మంది నుంచి డబ్బు కాజేస్తుంటారు. వీటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

UPI Fraud Alert: మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోండి..
UPI Frauds
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 26, 2022 | 10:02 AM

UPI Fraud Alert: స్కూల్ టీచర్ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా చాలా దిగులుగా ఉన్నాడు. దానికి ఒక కారణం ఉంది. అదేమింటంటే.. అతడి ఎకౌంట్ నుంచి ఎవరో రూ.30 వేలు డ్రా చేశారు. ఇది UPI చెల్లింపులో జరిగిన స్కామ్. శ్రీనివాస్ తన పాత వాషింగ్ మెషీన్‌ను అమ్మడానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. కొనుగోలుదారుగా నటిస్తూ కొందరు అతనికి ఫోన్ చేసి.. వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నట్లు చెప్పారు. కన్ఫర్మేషన్ కోసం ముందుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు చిన్న మొత్తాన్ని పంపిస్తానని శ్రీనివాస్‌కు నమ్మబలికారు. ముందుగా రెండు రూపాయలు పంపి శ్రీనివాస్‌ను పేమెంట్ కన్ఫర్మ్ చేయమని అడిగాడు. వచ్చాయని శ్రీనివాస్ అతనికి బదులిచ్చాడు. ఆ తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి శ్రీనివాస్‌కు క్యూఆర్ కోడ్ పంపాడు. మిగిలిన డబ్బును పంపడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని శ్రీనివాస్‌ను కోరాడు. సైబర్ క్రిమినల్ చెప్పినట్లు చేయడంతో శ్రీనివాస్ ఎకౌంట్ నుంచి మూడు విడతలుగా మొత్తం రూ.30 వేలు డ్రా అయ్యాయి. ఇలా మోసపోయిన వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి మోసాలలో చిక్కుకోకుండా ఉండాలంటే.. మీరు అప్రమత్తంగా ఉండాలి.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ మోసాలతో జాగ్రత్త..

డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరణతో UPI యాప్‌ల వినియోగం పెరుగుతోంది. అదే సమయంలో సైబర్ మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. శ్రీనివాస్‌ని క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయమని చెప్పి మోసం చేశారు. ఇలానే అనేక సందర్భాల్లో, సైబర్ మోసగాళ్లు ముందుగా పేమెంట్ రిక్వెస్ట్ అంగీకరించమని అడుగుతారు. లేకపోతే లావాదేవీ విఫలమవుతుందని చెబుతూ వారిని మాయ చేస్తారు. మీరు QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, రెండు కారకాల ఫ్యాక్టర్స్ (2 FA) లేదా UPI పిన్‌ను అడుగుతారు. మరోవైపు, మీరు పేమెంట్ రిక్వెస్ట్ ను అంగీకరించినప్పుడు, UPI యాప్ మిమ్మల్ని లావాదేవీకి చివరి దశ అయిన పిన్‌ని అడుగుతుంది. అంటే మీరు UPI PINని నమోదు చేసిన వెంటనే, మీ డబ్బు తీసుకుంటారు. QR కోడ్‌ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదని లేదా చెల్లింపును స్వీకరించడానికి రిక్వెస్ట్ ఆమోదించాల్సిన అవసరం లేదని కొందరు అర్థం చేసుకోలేరు. OTP, పాస్‌వర్డ్, MPIN, UPI పిన్ వంటి అంశాలు మీరు డెబిట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అవసరం. మీ ఖాతాలో డబ్బును క్రెడిట్ చేయడానికి కాదని గుర్తుంచుకోండి. సైబర్ మోసగాళ్లు మీకు నకిలీ బ్యాంక్ URLలు లేదా చెల్లింపు లింక్‌లను SMS ద్వారా పంపుతారు. దాన్ని క్లిక్ చేయడం ద్వారా, వారు మీ ఫోన్ UPI యాప్‌ని చూడగలుగుతారు. ఈలోగా, మీ ఫోన్ నుంచి ఆటో-డెబిట్‌ని ఎనేబుల్ చేయడానికి UPI యాప్‌లలో ఒకదాన్ని ఎంచుకోమని మిమ్మల్ని అడుగుతారు. మీరు దీన్ని ఆమోదించిన వెంటనే, మీ UPI యాప్ ద్వారా డబ్బు తక్షణమే తీసుకుంటారు. ఇది కాకుండా, నకిలీ URLపై క్లిక్ చేయడం ద్వారా, మీ ఫోన్ వైరస్ లేదా మాల్వేర్ బారిన పడవచ్చు. మీ పరికరంలో నిల్వ చేసిన మొత్తం ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ఈ రకమైన మాల్వేర్ ను ఉపయోగిస్తారు.

UPI మోసాలను ఎలా నివారించాలి..

UPI లావాదేవీలు నిరంతరం పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2021 నుంచి జనవరి 2022 వరకు UPI ద్వారా రూ.75.6 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఈ కాలంలో సగటు నెలవారీ లావాదేవీ రూ.6.3 లక్షల కోట్లుగా ఉంది. మీరు UPIని క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే, సైబర్ మోసాన్ని ఎలా నివారించాలో మీరు తెలుసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది UPI పిన్, OTP మొదలైనవాటిని ఎవరితోనూ షేర్ చేయవద్దు. బ్యాంకులు తరచూ క్లారియన్ కాల్‌లను పంపుతాయి. అలాంటి సమాచారాన్ని వారు మిమ్మల్ని ఎప్పుడూ అడగరు. బ్యాంకుల సూచనలను మీరు గమనించాలి.

పాటించవలసిన జాగ్రత్తలు..

OTP, UPI PINని షేర్ చేయకపోవడమే కాకుండా, మీరు కొన్ని ఇతర విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు ఎవరైనా అపరిచితులతో సంప్రదించినప్పుడు మీ ఆర్థిక వివరాలను చెప్పకూడదు. స్పామ్ సందేశాలపై క్లిక్ చేయ్యొద్దు. వాటి వల్ల మీ డేటా లీక్ కావొచ్చు. సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదించడానికి వాటిని ఉపయోగిస్తారు. వారు మీకు సంబంధించిన ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని అందించడం ద్వారా చివరికి మీకు నమ్మకాన్ని కల్పిస్తారు. వారు మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే, ఏదైనా అన్‌వాంటెడ్ చెల్లింపు లింక్‌పై క్లిక్ చేయవద్దు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏదైనా పేమెంట్ తీసుకోవడానికి మీరు UPI పిన్‌ను షేర్ చేయనవసరం లేదని గుర్తుంచుకోవాలి.

ఇవీ చదవండి..

Medicines Price Hike: 800 రకాల మందుల ధరలు పెంపు.. పారాసెట్మాల్ తో సహా..

Truecaller: యూజర్లను ఆకట్టుకునేందుకు ట్రూకాలర్‌ మరో అడుగు.. ఆకట్టుకునే మరో నాలుగు కొత్త ఫీచర్లు..

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పోలీసుల ఉక్కుపాదం..వారికి నోటీసులు
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
కేకేఆర్‌లో చేరిన డేంజరస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ మధ్యలో షడన్ ఎంట్రీ
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
ఇకపై హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరి.. లేదంటే!
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఆర్బీఐ సంచలన నివేదిక..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ..
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
రేపే ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం,భక్తులకు తిరుమలలడ్డూలు
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఔట్ లేదా నాటౌట్? వివాదంగా మారిన రియాన్ పరాగ్ వికెట్
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
ఢిల్లీకి షాకింగ్ న్యూస్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమైన కేటుగాడు?
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్..
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు
ఢిల్లీకి షాకిచ్చిన జీటీ.. ఆర్ఆర్ ఓటమితో పాయింట్ల పట్టికలో మార్పు