Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saudi Attacks: రెచ్చిపోయిన హౌతీ తిరుగుబాటు దారులు.. చమురు డిపో పేల్చివేత..

Saudi Attacks: సౌదీ అరేబియాలోని జెడ్డాలోని చమురు డిపోపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు(YEMEN REBELS) దాడి చేశారు. F1 రేసు రేసింగ్‌ కు జెడ్డా నగరం ఆథిత్యం ఇస్తున్న ఆ ప్రాంతంలో దాడులు చేపట్టారు.

Saudi Attacks: రెచ్చిపోయిన హౌతీ తిరుగుబాటు దారులు.. చమురు డిపో పేల్చివేత..
Saudi Arabia
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 26, 2022 | 10:51 AM

Saudi Attacks: సౌదీ అరేబియాలోని జెడ్డాలోని చమురు డిపోపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు(YEMEN REBELS) దాడి చేశారు. F1 రేసు రేసింగ్‌ కు జెడ్డా నగరం ఆథిత్యం ఇస్తున్న ఆ ప్రాంతంలోని భారీ చమురు నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. F1 రేసు(Formula one race) ప్రారంభానికి ముందు ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడిలో రెండు భారీ ఇంధన ట్యాంకులు పూర్తిగా ధ్వంసమైనట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఆర్థికవ్యవస్థలో కీలకమైన చమురు ఉత్పత్తులను ధ్వంసం చేసి ఆర్థికంగా నష్టపరచేందుకే తిరుగుబాటుదారులు ఇంధన నిల్వలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు.

వీటికి తోడు రియాద్‌ సమీప ప్రాంతాల్లోనూ విద్యుత్‌స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు సౌదీ మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. ఈ దాడుల్లో కొన్ని ఇళ్లు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపింది. మరో వైపు రేపు (ఆదివారం) F1 రేసింగ్‌ను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. ఈ రేస్ కార్యక్రమానికి వచ్చే అతిథుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు వెల్లడించారు. 2020 నవంబర్‌లోనూ ఇదే చమురు నిల్వ కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. సౌదీలో హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న ఈ దాడులను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. ఇటువంటి దాడులు పౌరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయని ట్వీట్టర్ వేధికగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

UPI Fraud Alert: మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోండి..

Medicines Price Hike: 800 రకాల మందుల ధరలు పెంపు.. పారాసెట్మాల్ తో సహా..