Summer Food Tips: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటుందా? ఆహారం తినేప్పుడు ఈ డ్రింక్స్ తాగండి..

Summer Food Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఎండ వెడిమి కారణంగా చర్మం జిగటగా మారుతుంది.

Summer Food Tips: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటుందా? ఆహారం తినేప్పుడు ఈ డ్రింక్స్ తాగండి..
Food
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 26, 2022 | 7:31 AM

Summer Food Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. సమస్యలు చుట్టుముట్టేస్తాయి. ఎండ వెడిమి కారణంగా చర్మం జిగటగా మారుతుంది. వడదెబ్బ, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు మొదలవుతాయి. ముఖం డల్ అవుతుంది. సాధారణంగా చర్మంపై దద్దుర్లు, మొటిమలకు కారణం మంచి ఆహారం తినకపోవడమే. అలాగే దుమ్ము, మట్టి, ఎండ వేడిమి కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇంకా ముఖ్యంగా వేసవిలో ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి. శరీరం డీహైడ్రేట్ అవుతుంటుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆరోగ్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఆహారం తినేటప్పుడు.. ఆరోగ్యకరమైన డ్రింక్స్ తాగితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. వీటిని తాగడం ద్వారా.. కడుపు చల్లగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. దాంతోపాటు.. చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరి, అలోవెరా డ్రింక్స్.. ఉసిరి, అలోవెరా రెండూ చర్మం, జుట్టు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉసిరి, కలబంద జ్యూస్ ఉదయం, సాయంత్రం తాగితే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు మంట సమస్య తగ్గుతుంది. చర్మ సమస్యలు కూడా నయమై.. కాంతివంతంగా ఉంటుంది. మొటిమల సమస్య నుంచి ఉపశమనం లబిస్తుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా మారుతుంది.

పండ్ల రసం.. వేసవిలో నారింజ, పుచ్చకాయ, దానిమ్మ, దుంప వంటి పండ్ల రసాన్ని తాగాలి. దీంతో జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని రక్తహీనత తొలగిపోయి చర్మం శుభ్రంగా ఉంటుంది.

పుదీనా వాటర్.. వేసవిలో పుదీనా వాటర్ తాగడం వల్ల కూడా అద్భుత ప్రయోజనం ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, అసిడిటీ, పుల్లని త్రేనుపులు, వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తుంది. పుదీనా నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. చెమట ద్వారా ఏర్పడే జిడ్డు, దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది. పుదీనా వాటర్ శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగిస్తుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

పసుపు, నిమ్మకాయ రసం.. పసుపులో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. నిమ్మకాయ రసం శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. అలాగే, పసుపు, నిమ్మకాయతో చేసిన జ్యూస్ కడుపుని క్లీన్ చేస్తుంది. దాంతో పాటు చర్మ సంబంధిత రుగ్మతలను తొలగిస్తుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

(ఈ కథనంలో అందించిన సమాచారం ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు ఈ సూచనలను ధృవీకరించలేదు. వీటిని తీసుకునే ముందు నిపుణుల సంప్రదించి వారి సలహా మేరకు సేవిస్తే ప్రయోజనం ఉంటుంది.)

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?