Summer Health: వేసవిలో సాయంత్రం స్నానం చేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
వేసవి కాలం ప్రారంభమయ్యింది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా..
వేసవి కాలం ప్రారంభమయ్యింది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. దీంతో ప్రజలు ఎండనుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీహైడ్రేషన్ కాకుండా.. ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్స్.. డ్రింక్స్ తీసుకుంటూ శరీరంలో నీటి శాతం పెంచుకుంటున్నారు. అయితే వేసవిలో అనేకసార్లు స్నానం చేసే అలవాటు ఉంటుంది.. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు.. సాయంత్రం మళ్లీ స్నానం చేసి రిలాక్స్ అవుతుంటారు. (Summer) స్నానం చేయడానికి కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఉదయం కంటే సాయంత్రం స్నానం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.. స్నానం (Bathing Time) చేసే సమయంలో రక్తప్రసరణ మెరుగుపడడమే కాకుండా.. మానసిక ఒత్తిడి తగ్గుతుందని మీకు తెలుసా.. మానసిక ఒత్తిడి.. కుంగుబాటు.. ఉన్నప్పుడు స్నానం చేయడం వలన మీలో చాలా మార్పులు వస్తాయి.
అందుకే స్నానం ఎప్పుడెప్పుడు చేయాలనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. కాబట్టి మీరు స్నానం చేసే సమయాన్ని ఎలా నిర్ణయించుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తీసుకుందామా..
స్నానం చేయడానికి సమయం.. వేసవిలో చాలా మంది ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ సాయంత్రం కూడా స్నానం చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఉదయం పూట తల స్నానం చేయడం కంటే.. సాయంత్రం తలస్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట పనిచేసే సమయంలో దుమ్ము.. మట్టి.. శరీరం.. జుట్టుపై పెరుగుకుపోతుంది. ముఖ్యంగా వేసవి.. వర్షకాలంలో పడుకునే ముందు తలస్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన శరీరం మాత్రమే కాదు.మనసు కూడా రిలాక్స్ అవుతుంది. దీంతో మంచి నిద్ర వస్తుంది. అందుకే ఉదయం మాత్రమే కాకుండా.. సాయంత్రం కూడా స్నానం చేయడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు నిపుణులు.
సాయంత్రం స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు.. సాయంత్రం స్నానం చేయడం వల్ల రోజంతా మీ శరీరంపై పేరుకుపోయిన దుమ్ము, మట్టి..బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనితో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించుకుంటారు. సాయంత్రం పూట తలస్నానం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వేసవిలో పగటి వేడి నుండి బయటపడటానికి సాయంత్రం స్నానం చేయడం మంచి ఎంపిక. అలాగే, స్నానం చేయడం వల్ల తాజాదనాన్ని ఇస్తుంది అలాగే గుండె.. మనస్సు విశ్రాంతినిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందుకే సాయంత్రం పూట స్నానం చేయడం చాలా అనుకూలమైనది.
ఎప్పుడు స్నానం చేయకూడదు.. సాయంత్రం స్నానం చేయడం వల్ల దాని సొంత ప్రయోజనాలు ఉంటాయో అదే విధంగా ఉదయం స్నానం చేయకూడని సమయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ జరుగుతుంది. ఆహారం తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఆయుర్వేదంలో భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలు స్నానం చేయకూడదు. అలాగే పడుకునే ముందు స్నానం చేయడం సరికాదు. ఇది కాకుండా, మీకు వేసవిలో రోజంతా చాలాసార్లు స్నానం చేసే అలవాటు ఉంటే దానిని మానుకోవాలి.
గమనిక:- పైన పేర్కొన్న కథనం కేవలం ఇతర సైట్స్ ఆధారంగా.. వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. సందేహాలకు వైద్యులను సంప్రదించాలి.
Also Read: Beast: పాన్ ఇండియా స్టార్‌గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
RRR Movie: ‘మహారాజ’ మౌళికి హ్యాట్సాఫ్.. రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించిన పాన్ ఇండియా డైరెక్టర్..
Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..
Indian Idol Telugu: ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్‌లో ఛాలెంజింగ్ ఎపిసోడ్.. ఓటింగ్ లైన్స్ ప్రారంభం..