- Telugu News Photo Gallery Home Remedies for Gastric stomach chest problem health care tips in telugu
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
Gastric Problem Home Remedies: ప్రస్తుత కాలంలో రోజూ తీసుకుంటున్న పలు ఆహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, కడుపు మంట, అజీర్తి, మలబద్దకం, ఛాతీ నొప్పి లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే.. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు కొన్ని చిట్కాలను అనుసరిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆ హోం రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 26, 2022 | 9:25 PM

తులసి: ఆయుర్వేద మొక్క తులసిని.. చాలామంది పూజలల్లో వినియోగిస్తారు. అయితే.. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తీసుకుంటే మంచిది. ఇది గ్యాస్ట్రిక్ వాల్యూమ్‌ను తగ్గిస్తుంది.

మజ్జిగ: వేసవిలో మజ్జిగ శరీరాన్ని చల్లబరిచేలా చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగుతే చాలామంచిది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.

పాలు: గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు చల్లటి పాలు తాగితే ఛాతీ మంట, గ్యాస్ట్రిక్ సమస్య త్వరగా తగ్గుతుంది. పాలు తాగేటప్పుడు పంచదార వేయకూడదు.

సోంపు: భోజనం చేసిన తర్వాత సోంపు తింటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. అందుకే హోటళ్లలో భోజనం చేశాక సోంపు ఇస్తారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు సోంపు తినడం మంచిది. దీంతోపాటు సోంపు ఉబ్బరాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

కొత్తిమీర-దనియాలు: గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు కొత్తిమీర, దనియాలు తినడం మంచిది. వీటిని నేరుగా తిన్నా.. లేదా నీటిలో వేసుకొని మరిగించి తాగినా ఛాతీలో మంట తక్షణమే తగ్గుతుంది. మీరు జీలకర్ర కూడా తినవచ్చు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను వెంటనే అరికడుతుంది.






























