Viral Video: ఆపదలో ప్రాణాలు కాపాడుకోవాలంటే మన వంతు ప్రయత్నం చేయాలి.. ఈ భారీ ఏనుగు చేసిన పని చూస్తే ముక్కున వెలేసుకుంటారు!
Viral Video: దట్టమైన అడవుల్లో ఉండే జంతువులు(Wild Animals) తరచుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. బురద గుంటలో పడి జంతువులు అందులో చిక్కుకుని ప్రాణాపాయానికి..

Viral Video: దట్టమైన అడవుల్లో ఉండే జంతువులు(Wild Animals) తరచుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. బురద గుంటలో (stuck in swamp) పడి జంతువులు అందులో చిక్కుకుని ప్రాణాపాయానికి గురవుతుంటాయి. అలాంటి సమయంలో తమను బయటకు తీసే వ్యక్తుల సహాయం కోసం ఎదురుచూస్తుంటాయి. తాజాగా ఓ భారీ ఏనుగు దట్టమైన అడవిలోని బురద గుంటలో చిక్కుకుంది. అయితే వెంటనే అటవీ సిబ్బంది ఏనుగును ఆ బుదర నీటి నుంచి బయటకు తీశారు. సకాలంలో రక్షించారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
ఓ భారీ ఏనుగు నీలగిరిలోని గూడలూర్‌లోని చిత్తడి నేలలో చిక్కుకుపోయింది. అయితే భారీ ఏనుగు అవ్వడంతో తాను తానుగా ఆ బురద గుంట నుంచి బయటకు రాలేక పోయింది. అయితే ఆ ఏనుగు బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అది చిత్తడిలో పడిపోతూనే ఉంది. ఈ విషయం గమనించిన అటవీ శాఖ సిబ్బంది ఈ భారీ ఏనుగును బురద నుంచి బయటకు రావడానికి సహాయం చేశారు. ఓ తాడు సాయంతో ఏనుగును బయటకు తీసుకుని రావడనికి ప్రయత్నిస్తున్న సమయంలో ఏనుగు కూడా తానూ ఆ సిబ్బందికి తన వంతు సహాయం అందించింది. తనను బయటకు లాగుతున్నప్పుడు తాడుని పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది.
Inspiring team work by #TNforesters in rescuing a 25-year-old elephant stuck in a swamp in Gudalur, #Nilgiris The elephant too did not give up and showed exemplary fighting power to get out of the swamp holding on to the rope thrown by her rescuers.Hats off ? #TNForest pic.twitter.com/YvT2Zmbcue
— Supriya Sahu IAS (@supriyasahuias) March 24, 2022
ఈ వీడియోని నీలగిరికి మానిటరింగ్ ఆఫీసర్ సుప్రియా సాహు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 25 ఏళ్ల ఏనుగు తనను తాను రక్షించుకోవడానికి ఉత్తమ పోరాట ప్రటిమ కనబరిచిందని ఆ వీడియోకి ఓ క్యాప్షన్ కూడా జతచేశారు. “ఏనుగు.. తనను రక్షించడానికి విసిరిన తాడును పట్టుకొని చిత్తడి నుండి బయటపడటానికి ఆదర్శప్రాయమైన పోరాట శక్తిని చూపించింది.”
Team behind the rescue #TNForest pic.twitter.com/eSHmp6INWw
— Supriya Sahu IAS (@supriyasahuias) March 25, 2022
వీడియో వైరల్ కావడంతో ప్రజలు అటవీ శాఖ సత్వర చర్యను అభినందించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జంతువులకు సహాయం చేయడానికి ఈ చిత్తడి నేలల చుట్టూ మెట్లు లేదా ర్యాంపులను నిర్మించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Kudos to the staff of Forest Department to help save this elephant. Every elephant’s life is so crucial for us. Unfortunately we are loosing a lots of them for many reasons and many are killed callously. SAVE THE ELEPHANTS.
— RAJA VENKATRAMAN. (@raja_venkatram) March 25, 2022
Also Read: Vastu Tips: తీసుకున్న అప్పులు తీరడం లేదా.. అయితే ఈ వాస్తు దోషాలు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి