Viral Video: టోర్నడో బీభత్సం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. చివరకు ఏమైందంటే..? వీడియో

Car is stuck in the tornado: టోర్నడో పేరు వింటే చాలు.. అమెరికా వాసులు గజగజ వణికిపోతుంటారు. తీవ్ర ఉద్ధృతితో చుట్టేసే ఈ సుడిగాలులు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ప్రాణాలను ఎత్తుకుపోతుంటాయి.

Viral Video: టోర్నడో బీభత్సం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. చివరకు ఏమైందంటే..? వీడియో
Tornado
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 26, 2022 | 3:44 PM

Car is stuck in the tornado: టోర్నడో పేరు వింటే చాలు.. అమెరికా వాసులు గజగజ వణికిపోతుంటారు. తీవ్ర ఉద్ధృతితో చుట్టేసే ఈ సుడిగాలులు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ప్రాణాలను ఎత్తుకుపోతుంటాయి. తాజాగా టెక్సాస్‌లో ఊహించని సంఘటన జరిగింది. ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రిలే లియోన్‌ అనే యువకుడు ఓ ఇంటర్వ్యూకి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా టోర్నడో వలయంలో చిక్కుకున్నాడు. సుడిగాలుల ధాటికి లియోన్‌ నడిపే కారు పల్టీలు కొట్టింది. మృత్యువు అంచు వరకూ వెళ్లిన అతడు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డాడు. రోడ్డుపై కారు పల్టీలు కొట్టినా అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. సుడిగాలి తీవ్రత కాస్త తగ్గడంతోనే కారుతో దూసుకెళ్లిపోయాడు. సుడిగాలికి కాస్త దూరంలో మరో కారులో ఉన్న వ్యక్తి ఈ దృశ్యాలను తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. గాల్లో కార్లు పల్టీలు కొట్టిన ఈ వీడియో సోషల్‌ మీడియా (Social Media) ను షేక్‌ చేస్తోంది.

సోమవారం సెంట్రల్ టెక్సాస్, ఓక్లహోమాలో భయంకరమైన టోర్నడోల వల్ల వందలాది చెట్లు నేలకూలాయి. ఇళ్లు సైతం ధ్వంసమయ్యాయి. భారీ టోర్నడోల వల్ల హైవేలు, విమానాశ్రయాలను మూసివేసాయి. బలమైన తుఫాను కారణంగా టోర్నడోలు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని పేర్కొంటున్నారు. దీనివల్ల వేలాది మంది విద్యుత్ సౌకర్యం లేక అల్లాడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో.. 

కాగా.. అమెరికాలో టోర్నడో భీభత్సం తరచూ కొనసాగుతోంది. దీనివల్ల ఒక్కొసారి ప్రజల ప్రాణాలు సైతం పోతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: నా జోలికి వస్తే అంతే సంగతులు.. కుంగ్ ఫూ స్టంట్స్ చేసిన పాండా.. వీడియో వైరల్

Saudi Attacks: రెచ్చిపోయిన హౌతీ తిరుగుబాటు దారులు.. చమురు డిపో పేల్చివేత..