AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెరువులో పడకుండా బాలుడిని రక్షించిన తెలివైన కుక్క.. బంతిని నీటి నుంచి తీసిన విధానానికి నెటిజన్లు ఫిదా

Viral Video: పెంపుడు జంతువులు సహజంగానే తమ యజమానులు పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి. ఇక తమ యజమాని పట్ల విశ్వాసం, ప్రేమను చూపించే విషయంలో కుక్కలు మొదటి ప్లేస్ లో ఉంటాయి...

Viral Video: చెరువులో పడకుండా బాలుడిని రక్షించిన తెలివైన కుక్క.. బంతిని నీటి నుంచి తీసిన విధానానికి నెటిజన్లు ఫిదా
Viral Video
Surya Kala
|

Updated on: Mar 26, 2022 | 3:11 PM

Share

Viral Video: పెంపుడు జంతువులు సహజంగానే తమ యజమానులు పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి. ఇక తమ యజమాని పట్ల విశ్వాసం ప్రేమను చూపించే విషయంలో కుక్కలు మొదటి ప్లేస్ లో ఉంటాయి. ఒక తెలివైన కుక్క ఒక చిన్న పిల్లవాడిని చెరువులో పడకుండా కాపాడింది. అంతేకాదు బాలుడు బంతిని పట్టుకుని తిరిగి బాలుడుకిచ్చింది. ఈ ఘటన చైనా (China )లోని షెన్‌జెన్‌ లో చోటుచేసుకుంది. కుక్కపిల్ల బాలుడి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారింది.

గార్డెన్ లో ఇద్దరు పిల్లలు కలిసి ఓ బంతితో ఆడుకుంటున్నట్లు వీడియోలో ఉంది. అయితే ఆ బంతి అక్కడే ఉన్న ఫిష్ పాండ్ లో పడింది. ఇది చూసి బాలుడు చెరువులోని బంతిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే అమ్మాయి పెద్దలను పిలవడానికి ఇంటి లోపలికి పరుగెత్తింది. బాలుడు బంతిని తీసుకోవడానికి చెరువు వద్దకు పరుగెత్తాడు. బాలుడు చెరువులోకి దిగబోతున్న బాలుడిని అక్కడే ఉన్న కుక్క గమనించింది. వెంటనే బాలుడి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి.. బాలుడి చొక్కా ను పళ్ళతో పట్టుకుని సురక్షితంగా వెనక్కి లాగింది. కుక్క అప్పుడు బంతిని పట్టుకోవడానికి నెట్‌ని ఉపయోగించింది.

ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను వైపరీతంగా ఆకర్షిస్తోంది. చెరువులో పడకుండా బాలుడిని రక్షించడం పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కుక్క ఫౌంటెన్‌లోకి దూకి బంతిని తీసుకుంటుందని భావించి నేను వీడియో చూడడం మొదలు పెట్టాను. అయితే కుక్క బంతిని బయటకు తీయడానికి నెట్‌ని ఉపయోగిస్తుందని అసలు ఊహించలేదు… “ఆ కుక్క బహుశా నాకంటే తెలివైనది.” అంటూ కామెంట్ చేస్తున్నారు. కుక్క తెలివితేటలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: India: భారత్‌లో ఏ రాష్ట్రంలోని వ్యవసాయోత్సాత్తులు ఏయే దేశాలకు ఎగుమతి అవుతున్నాయో మీకు తెలుసా..?