AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: భారత్‌లో ఏ రాష్ట్రంలోని వ్యవసాయోత్సాత్తులు ఏయే దేశాలకు ఎగుమతి అవుతున్నాయో మీకు తెలుసా..?

Agricultural Products: వ్యవసాయ రంగంలో భారతదేశం(Bharath) సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.  మన రైతులు సమగ్ర వ్యవసాయ  పద్ధతులు పాటించడం ద్వారా పంటల్లో అధిక దిగుబడిని..

India: భారత్‌లో ఏ రాష్ట్రంలోని వ్యవసాయోత్సాత్తులు ఏయే దేశాలకు ఎగుమతి అవుతున్నాయో మీకు తెలుసా..?
Agricultural Products Of In
Surya Kala
|

Updated on: Mar 26, 2022 | 2:49 PM

Share

Agricultural Products: వ్యవసాయ రంగంలో భారతదేశం(Bharath) సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.  మన రైతులు సమగ్ర వ్యవసాయ  పద్ధతులు పాటించడం ద్వారా పంటల్లో అధిక దిగుబడిని సాధిస్తున్నారు. వర్తక, వాణిజ్య, ఉద్యానవన ఉత్పత్తులను లాభసాటిగా అమ్మకం దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలోని వ్యవసాయోత్పత్తులు విదేశాల ఎంపికగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మఖానా (Makhana), మామిడి (Mango), అనాసపళ్ళు, అరటి, డ్రాగన్ ఫ్రూట్ , కర్భూజా, టమాట వంటి అనేక రకాల వ్యవసాయోత్పత్తులను ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధికంగా పండే పంటల గురించి.. వాటిని ఏఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నారో తెలుసుకుందాం…

బీహార్‌లో పండే మామిడి – ఇక్కడ పండే మామిడి పళ్ళను లిచ్చి యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో బాగా ఇష్టపడుతున్నారు. వ్యవసాయ మంత్రి శోభా కరంద్లాజే పంచుకున్న సమాచారం ప్రకారం.. భాగల్‌పూర్,  జర్దాలు మామిడి,  షాహి లిచ్చి లను యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)కి ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.

బీహార్‌లో విస్తారంగా లభించే మఖానా జపాన్‌కు ఎగుమతి అవుతోంది. దీని వల్ల రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతుండగా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పంచుకున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, మారుమూల ప్రాంతాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో తమదైన ముద్ర వేస్తున్నాయన్నారు.

దేశంలోని ఇతర పండ్లకు విదేశాల్లో మంచి గిరాకీ: మన దేశంలో లభించే పండ్లకు విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. మహారాష్ట్రలోని మరఠ్వాడా లో లభించే మామిడి.. యునైటెడ్ కింగ్‌డమ్ కి కూడా ఎగుమతి చేయబడుతోంది. బహ్రెయిన్‌ వాసులకు బెంగాల్‌లోని మామిడి పండ్లను ఇష్టపడతారు. మహారాష్ట్రకు చెందిన జల్‌గావ్ అరటి,  దుబాయ్ , సింగపూర్‌లోని కేరళకు చెందిన నందన్ అరటి పండ్లను ఎగుమతి చేస్తారు. అదేవిధంగా కేరళలోని పైనాపిల్‌ను షార్జహాన్‌కు ఎగుమతి చేస్తారు.

బెల్లం దుబాయ్ కి ఎగుమతి: దేశంలో తయారయ్యే బెల్లం దుబాయ్‌కి ఎగుమతి అవుతోంది. కేరళలోని బిజ్నోర్ , ఇడుక్కిలలో తయారైన బెల్లం దుబాయ్‌ కి అధికంగా ఎగుమతి చేయబడుతుంది. అదేవిధంగా హిమాచల్ ఆపిల్ పండ్లు  ఖతార్, బహ్రెయిన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన రాగి డెన్మార్క్‌ వాసులకు ఇష్టమైన ఎంపిక.

దేశంలో పండే డ్రాగన్ ఫ్రూట్ లండన్ , దుబాయ్‌లకు ఎగుమతి: దేశంలో పండుతున్న డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచంలోని రెండు సంపన్న దేశాల రాజధానులైన లండన్, దుబాయ్‌లకు ఎగుమతి అవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పంచుకున్న సమాచారం ప్రకారం, గుజరాత్‌లో పండించే డ్రాగన్ ఫ్రూట్ లండన్‌కు ఎగుమతి అవుతుండగా, మహారాష్ట్రలో పండించే డ్రాగన్ ఫ్రూట్ దుబాయ్‌కి పంపబడుతోంది.

Also Read: Pineapple Juice: వేసవి కాలంలో పైనాపిల్ జ్యూస్ తీసుకోండి.. ఈ సమస్యలకు చెక్ పెట్టండి