Vastu Tips: తీసుకున్న అప్పులు తీరడం లేదా.. అయితే ఈ వాస్తు దోషాలు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి
Vastu Tips: పరిమిత నెలవారీ ఆదాయంతో అన్ని అవసరాలను తీర్చుకోవడం సాధ్యంకాదు. అందుకనే అవసరాలను తీర్చుకోవడానికి తరచుగా అప్పుల సాయం తీసుకుంటారు. వ్యక్తి నుంచి తీసుకున్నా,.

Vastu Tips: పరిమిత నెలవారీ ఆదాయంతో అన్ని అవసరాలను తీర్చుకోవడం సాధ్యంకాదు. అందుకనే అవసరాలను తీర్చుకోవడానికి తరచుగా అప్పుల సాయం తీసుకుంటారు. వ్యక్తి నుంచి తీసుకున్నా, బ్యాంకు నుంచి తీసుకున్న రుణం భారాన్ని వీలైనంత త్వరగా తొలగించాలని అందరూ కోరుకుంటారు. అయితే అలా తీసుకున్న అప్పు తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తీర్చలేరు. అయితే అలాంటి రుణభారం తీర్చడానికి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిసార్లు వాస్తు దోషం వలన కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఆ తప్పులు చేస్తాం. అటువంటి తప్పులు ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. మనపై అప్పుల భారం మరింత పెరుగుతుంది. ఇవే కాకుండా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాస్తు దోషాలకు కారణమయ్యే తప్పుల గురించి తెలుసుకోండి.
మంచం మీద తినడం: కొన్నిసార్లు మనం మన సౌకర్యం కోసం మంచం మీద తింటాము. కానీ వాస్తు ప్రకారం అది సరైనది కాదు. మంచం మీద భోజనం చేయడం వల్ల రోగాలు వచ్చి ధన నష్టం వస్తుంది. అలాంటి వారికి విజయానికి తరచుగా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండదు.
మురికి పాత్రలు: రాత్రిపూట ఉపయోగించిన పాత్రలను శుభ్రం చేయకుండా అలా వదిలివేయడం కూడా మంచిది కాదు. ఇది వాస్తు దోషాలను కారణమవుతుంది. అందువల్ల, రాత్రిపూట వంటగదిలో రాత్రి ఉపయోగించిన పాత్రలను అలా ఉంచవద్దు. కనీసం వాటిని నీటితో కడగాలి.
ఖాళీ నీటి బకెట్: ఖాళీ నీటి బకెట్‌ను ఎప్పుడూ బాత్రూంలో లేదా వంటగదిలో ఉంచకూడదు. దానిని అలా ఉంచినట్లయితే, దానిని తిప్పండి లేదా ఒక పాత్రతో కప్పండి. ఖాళీ బకెట్ జీవితంలో ఆర్థిక సమస్యలను తెస్తుంది. మరోవైపు, బకెట్ నిండుగా ఉంచడం ప్రతికూలతను తొలగిస్తుంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
మెయిన్ డోర్ దగ్గర డస్ట్ బిన్ : ఇంటి ప్రవేశ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. చాలామంది తమ ప్రవేశద్వారం వద్ద డస్ట్‌బిన్‌లను ఉంచుతారు. ఇది మీకు సౌకర్యవంతంగా ఉండవచ్చు, కానీ వాస్తు కోణంలో మంచిది కాదు.
సాయంత్రం వీటిని అప్పుగా ఇవ్వొద్దు: సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బు, పాలు, పెరుగు, ఉప్పు అప్పుగా ఇవ్వకూడదు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అంతే కాకుండా సూర్యాస్తమయం సమయంలో ఇంటి తలుపులు మూసి ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా చెడిపోతుంది.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుడి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Also Read: India: భారత్‌లో ఏ రాష్ట్రంలోని వ్యవసాయోత్సాత్తులు ఏయే దేశాలకు ఎగుమతి అవుతున్నాయో మీకు తెలుసా..?