Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తవ్వకాల్లో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహం.. అదృష్టం అంటూ భక్తులు ప్రత్యేక పూజలు

Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌ (Amberpet) లో అద్భుతం జరిగింది. ఫాల్గుణ బహుళ అష్టమి రోజు అరుదైన అమ్మవారి విగ్రహం బయటపడింది. అహ్మద్ నగర్ (Ahmednagar) లో డ్రైనేజ్ కాల్వ..

Hyderabad: తవ్వకాల్లో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహం.. అదృష్టం అంటూ భక్తులు ప్రత్యేక పూజలు
Hyderabad Idol
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2022 | 11:19 AM

Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌ (Amberpet) లో అద్భుతం జరిగింది. ఫాల్గుణ బహుళ అష్టమి రోజు అరుదైన అమ్మవారి విగ్రహం బయటపడింది. అహ్మద్ నగర్ (Ahmednagar) లో డ్రైనేజ్ కాల్వ నిర్మాణం కోసం పనులు చేస్తున్నారు. ఈ సమయంలో డ్రైనేజ్ కోసం గుంతల కోసం జరిపిన తవ్వకాల్లో అతి పురాతనమైన అమ్మవారి రాతి వి గ్రహం బయటపడటం ప్రత్యేకతను సంతరించుకుంది. సుమారు 3 అడుగుల అమ్మవారి విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తండోపతండాలుగా అక్కడకు వచ్చి అమ్మ వారి విగ్రహానికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

ఫాల్గుణ బహుళ అష్టమి, సీతా జయంతి రోజు అమ్మవారి విగ్రహం బయట పడడం తమ అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ అక్కడికి చేరుకోవడం తో స్థానికులు ఆక్కడే గుడి కట్టించాలని కోరారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సహాయ సహకారాలతో గుడి నిర్మిస్తానని వారికి హామీ ఇచ్చారు.

Also Read:

TS TET 2022: నేటి నుంచి టెట్ అప్లికేషన్స్ స్వీకరణ.. ఈసారి కొన్ని మార్పులు.. వారికి కూడా రాసే అవకాశం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

India corona cases: ఊరట కలిగిస్తోన్న కొత్త కేసులు.. ఆందోళనకరంగా కరోనా మరణాలు