India corona cases: ఊరట కలిగిస్తోన్న కొత్త కేసులు.. ఆందోళనకరంగా కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసుల రోజూవారీ గణాంకాలు(Corona Cases) ఊరట కలిగిస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్యను చూసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ కూడా మరో సారి 2 వేలకు దిగువనే కొత్త...

India corona cases: ఊరట కలిగిస్తోన్న కొత్త కేసులు.. ఆందోళనకరంగా కరోనా మరణాలు
Corona
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 26, 2022 | 10:36 AM

దేశంలో కరోనా కేసుల రోజూవారీ గణాంకాలు(Corona Cases) ఊరట కలిగిస్తున్నాయి. కొత్త కేసుల సంఖ్యను చూసుకుంటే కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ కూడా మరో సారి 2 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే మరమణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు(Central Health Department) వెల్లడించింది. శుక్రవారం 6.5 లక్షల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 1,660 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. కొద్దికాలంగా రోజువారీ పాజిటివిటీ(Positivity) రేటు ఒక శాతానికి దిగువనే నమోదవడం సానుకూలాంశం. గత కొన్ని రోజులుగా 100 దిగువనే నమోదవుతున్న మరణాలు నిన్న 4,100కి పెరిగాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు గతంలో ఇచ్చిన గణాంకాలను సవరించడంతో భారీగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 5.20 లక్షల మంది కరోనాతో మృతిచెందారు.

వైరస్ బారి నుంచి శుక్రవారం 2,349 మంది కోలుకున్నారు. దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 20 వేల దిగువకు చేరింది. ప్రస్తుతం 16,741 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా టీకా కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోంది. శుక్రవారం 29.07 లక్షల మంది టీకా వేయించుకోగా మొత్తంగా 182 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

మరోవైపు చైనాలో మాత్రం కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ఆ దేశంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మార్చి నెలలోనే ఇప్పటివరకు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కొవిడ్‌ కట్టడికి అన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నామని అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు అంటున్నారు. డైనమిక్‌ జీరో కొవిడ్‌(Zero Method) లక్ష్యాన్ని స్వల్ప కాలంలో సాధించేందుకు కృషి చేస్తున్నామని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ నిపుణులు పేర్కొన్నారు.

Also Read

UPI Fraud Alert: మీరు UPI పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోండి..

Mahesh Babu : ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. ఆ మాస్ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Digestive system: జీర్ణవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వీటిని తినండి.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.