TS TET 2022: నేటి నుంచి టెట్ అప్లికేషన్స్ స్వీకరణ.. ఈసారి కొన్ని మార్పులు.. వారికి కూడా రాసే అవకాశం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
TS TET 2022: తెలంగాణ(Telangana) లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ వరసగా వివిధ ఉద్యోగులకు జాబ్ నోటిఫికేషన్(Job Notification) రిలీజ్ చేస్తూనే ఉంది. తాజాగా టీచర్ పోస్టుల భర్తీకి..
TS TET 2022: తెలంగాణ(Telangana) లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ వరసగా వివిధ ఉద్యోగులకు జాబ్ నోటిఫికేషన్(Job Notification) రిలీజ్ చేస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ పాఠశాల విద్యా శాఖ TSTET 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు TSTET అధికారిక సైట్ tstet.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు.. తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ కు నేటి (మార్చి 26 నుంచి) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు. 27న రిజల్ట్ ను విడుదల చేయనున్నారు.
టెట్ పూర్తైన అనంతరం టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. అయితే ఈ ఏడాది టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులను చేసింది విద్యాశాఖ. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు. అయితే ఈ సారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాయడానికి అవకాశం కలిగింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మార్పులను చేస్తూ నిర్ణయం తీసుకుంది.
టెట్ పరీక్షలను 2017 సిలబస్ ప్రకారమే నిర్వహించనున్నామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. అంతేకాదు ఈ సారి టెట్‌కు బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా అవకాశం కల్పించినట్లు చెప్పారు. పేపర్-1, పేపర్-2 కు దరఖాస్తు రుసుము రూ.300గా నిర్ణయించారు. రెండు పేపర్లు రాసేవారికి కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. టెట్ కు అప్లై చేసుకొనేవారు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల వరకూ అర్హులు.
నేటి నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రెండు పేపర్లు రాయాలనుకునే అభ్యర్థులు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ వేరు వేరు అప్లికేషన్స్ చేస్తే.. అపుడు వేర్వేరు పరీక్షాకేంద్రాలను కేటాయించే అవకాశం ఉంది. కనుక టెట్ రెండు పేపర్లు రాయాలను కొనేవారు ఒకే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల సందేహాలు, సూచనల కోసం హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి జూన్ 12 వరకు హెల్ప్‌డెస్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
హాల్‌టికెట్లను జూన్ 6 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలకు tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సి ఉంది.