Govt Hospital Jobs: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకు పైగా జీతం..
Govt Hospital Jobs: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు...
Govt Hospital Jobs: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూం అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, సిటీ టెక్నీషియన్ ఆడియో టెక్నీషియన్, ఆడియో టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్మీడియట్, డిప్లొమా/ బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత కోర్సులో సర్టిఫికేట్లతో పాటు అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను సూపరిండెంట్, జీజీహెచ్, విజయవాడ, కృష్ణా జిల్లా, ఏపీ అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ. 61,960కి చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..
Electricity Fraud: విద్యుత్ శాఖలో వింత మోసం బట్టబయలు.. మీటరున్నా.. బిల్లు రాకపోవడంతో అనుమానం!