Chanakya Niti: మీరు వ్యక్తి విషయంలో మోసపోకుండా ఉండాలంటే.. అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయమంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. ఈ  చాణక్య నీతిని బాగా..

Chanakya Niti: మీరు వ్యక్తి విషయంలో మోసపోకుండా ఉండాలంటే.. అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయమంటున్న చాణక్య
Chanakya Niti
Follow us

|

Updated on: Mar 26, 2022 | 10:15 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. ఈ  చాణక్య నీతిని బాగా చదివి, అనుసరించినట్లయితే, ఎవరికైనా విజయం తధ్యమని పెద్దల నమ్మకం. ఇందులో మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి.  ఆచార్య తన చాణక్య నీతి పుస్తకంలో ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తె.. ఎవరైనా జీవితంలో సులభంగా మోసపోలేరని చెప్పాడు.

ఆచార్య చాణక్యుడు.. మనం ఒకరి గురించి చాలా త్వరగా అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటాము, అయితే  వ్యక్తి యోగ్యతలు, లోపాలు బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. కనుక అతనితో కొంత సమయం ఓపికగా గడపండి. అతని ప్రవర్తనను గమనించండి. అంతేకాదు ఇతర వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. ఇతరులతో వ్యవహరించే విషయంలో అతని నిజమైన స్వభావం మీ ముందుకు వస్తుంది.

ఒక వ్యక్తిలో త్యాగ స్ఫూర్తి ఎంత  ఉందో చూడటం చాలా ముఖ్యం. త్యాగం చేసే గుణం ఉన్నవారు ఇతరుల బాధలను అర్థం చేసుకుని సహాయం చేస్తారు. మరోవైపు, త్యాగం చేయడం తెలియని వారు స్వార్థపరులు. అంతేకాదు తాము అనుకున్నది పొందడానికి ఏదైనా చేస్తారు.

వ్యక్తి  స్వభావాన్ని,  అతని పనితీరుని బట్టి అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తే, అతని స్వభావంలో మోసపూరితమైన నేచర్ ఖచ్చితంగా ఉంటుంది. అతని నుండి దయ, నిజాయితీని ఆశించడం వ్యర్థం.

వ్యక్తి వ్యక్తిగత లక్షణాలు .. అతని విలువలను తెలుపుతుంది. సంస్కారం ఉన్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా కొన్ని సూత్రాలు ఉంటాయి. అతను ఎప్పుడూ తప్పు చేయడు. కానీ సంస్కారం లేని వ్యక్తిపై ఆశలు పెట్టుకోవడం అసంబద్ధం.

Also Read: Pawan Kalyan: మేమిద్దరం మంచి స్నేహితులం.. అడిగితే ఏమైనా ఇస్తా.. అవసరం అయితే ఫ్రీగా సినిమా చేస్తా.. .. ఆ ఒక్కటి తప్ప

Latest Articles