Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఆరోజు శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వేడుకగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ వేడుకలకు ముందు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వేడుకగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ వేడుకలకు ముందు శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 29న ఆగమోక్తంగా ఆలయ శుద్ధి వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. ఈ సందర్భంగా ఆ రోజు బ్రేక్( Break Darshanams) దర్శనాలు రద్దు చేస్తున్నట్లుప్రకటించింది. మార్చి 28వ తేదీన ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.
ఏడాదికి నాలుగుసార్లు..
సాధారణంగా శ్రీవారి ఆలయంలో ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 29న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకుని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను శుద్ధి చేయనున్నారు. కాగా ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
Also Read:Akhilesh Yadav: యూపీ ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్.. ఎస్పీ సమావేశంలో కీలక నిర్ణయం..
Beast: పాన్ ఇండియా స్టార్‌గా హీరో విజయ్ ప్రయత్నం.. బీస్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..
TS Polycet 2022: తెలంగాణ పాలీసెట్ 2022కు దరఖాస్తు చేసుకుంటున్నారా? ఆ ఫీజు పెంచుతూ ఉత్తర్వులు..