TS Polycet 2022: తెలంగాణ పాలీసెట్ 2022కు దరఖాస్తు చేసుకుంటున్నారా? ఆ ఫీజు పెంచుతూ ఉత్తర్వులు..
తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022)కు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ అభ్యర్ధులకు రిజిస్ట్రేషన్ రుసుమును పెంచుతూ TS SBTET ఉత్తర్వులు జారీ చేసింది..
TS Polycet 2022 application last date: తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS Polycet 2022)కు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఈసారి పరీక్షకు దరఖాస్తు చేసుకునే జనరల్, బీసీ అభ్యర్ధులకు రిజిస్ట్రేషన్ రుసుమును పెంచుతూ TS SBTET ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జనరల్, బీసీ అభ్యర్ధులకు రూ.400లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ. 250లు ఉండగా.. ఈ ఏడది అదనంగా రూ. 50ల మేరకు రిజిస్ట్రేషన్ ఫీజును పెంచింది. దీంతో జనరల్, బీసీ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజు రూ.450లకు పెరగగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు మాత్రం గత ఏడాది మాదిరిగానే రూ.250 ఫీజును నిర్ణయించింది. ఈ ఏడాది కూడా పాలీసెట్‌కు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాంకుల విషయంలో కూడా గత ఏడాదిమాదిరిగానే ఒక్కో విద్యార్ధికి రెండేసి చొప్పున ర్యాంకులు కేటాయించనున్నారు.
నోటిఫికేషన్ ప్రకారం.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TS SBTET) ఏప్రిల్ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. జూన్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది.100 రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పాలీ సెట్ 2022 పరీక్ష జూన్ 30 రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.12 రోజుల అనంతరం పాలిసెట్ ఫలితాలు విడుదలౌతాయి. కాగా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. పాలీసెట్ ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కాలేజీల్లో ఇంజనీరింగ్/నాన్ ఇంజినీరిగ్ డిప్లొమా కోర్సు్ల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
Also Read: