Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు
Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు (Bus) కొంత భాగం దగ్ధమైంది...
Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు (Bus) కొంత భాగం దగ్ధమైంది. శ్రీవారి సేవకులతో తిరుమల (Tirumala)కు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాపించడంతో అందరు కిందకి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే డీజిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవ్వరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి: