Tirupati: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు....

Tirupati: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 27, 2022 | 8:37 AM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. 44 మందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూయాలో 31 మందికి చికిత్స, స్విమ్స్ లో 7 మందికి, బర్డ్ ఆసుపత్రిలో 6 మందికి చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగినట్లు పోలీసులు గుర్తించారు. ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణు అనే యువకుడికి చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ వద్ద ఉన్న పెద్ద మలుపులో ప్రమాదం జరిగింది.

అతి వేగంగా బస్సు నడపడంతో బస్సు అదుపుతప్పి కుడివైపున లోయలోకి దూసుకెళ్లింది. ఈ లోయ లోతు సుమారు 60 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం, తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల రోదనలు, మృత దేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.