AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుగురు బాయ్ ఫ్రెండ్స్.. భర్తతో విడాకులు.. కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని దారుణం

మానవ సమాజానికి మాయని మచ్చ తెచ్చే సంఘటన ఇది. ఓ తల్లీ చేయకూడని పని చేసిన ఓ మహిళ.. ఆఖరుకు కటకటాలపాలైంది. భర్తతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో విభేదాలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి. వివాహ బంధం...

నలుగురు బాయ్ ఫ్రెండ్స్.. భర్తతో విడాకులు.. కుమారుడిని అడ్డు తొలగించుకోవాలని దారుణం
Daughter Murder
Ganesh Mudavath
|

Updated on: Mar 27, 2022 | 8:26 AM

Share

మానవ సమాజానికి మాయని మచ్చ తెచ్చే సంఘటన ఇది. ఓ తల్లీ చేయకూడని పని చేసిన ఓ మహిళ.. ఆఖరుకు కటకటాలపాలైంది. భర్తతో ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో విభేదాలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి. వివాహ బంధం(Marriage) పొసగక.. కొన్నాళ్లకే విడాకులు తీసుకున్న ఆ జంటకు అప్పటికే ఇద్దరు కుమారులు సంతానం. వారిని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితి. చివరికి వారినీ పంచుకున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే జల్సాలకు అలవాటైన ఆ మహిళ(తల్లి) కి నలుగు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తమ సంబంధాలకు కుమారుడు అడ్డు వస్తున్నాడనే కారణంతో ఆమె దారుణానికి తెగబడింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అత్యంత కర్కశంగా మట్టుబెట్టింది. ఏమీ తెలియనట్లు వ్యవహరించి సహజ మరణంగా చిత్రించాలనుకుంది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

తమిళనాడు ఊటీలోని వాషర్ మెన్ పేట్‌కు చెందిన కార్తీక్, గీతలకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలహాలు తలెత్తాయి. ఆ గొడవలు చినికీ చినికీ గాలివానగా మారి.. పంచాయితీ వరకు చేరింది. పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా కాపురం నిలబడకపోవడంతో విడాకులు తీసుకున్నారు. తల్లి దగ్గర ఒక కొడుకు, తండ్రి వద్ద ఇంకో కుమారుడు ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లి వద్ద ఉంటున్న నితిన్ అనారోగ్యానికి గురయ్యాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధరించారు. బాలుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి.

గీతకు అప్పటికే నలుగురు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని పోలీసులు గుర్తించారు. కార్తీక్‌తో పెళ్లికి ముందే మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకుని విడాకులు ఇచ్చినట్టు వివరించారు. నాలుగో బాయ్‌ ఫ్రెండ్‌తో జల్సాల కోసమే విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. జల్సాల అడ్డుగా ఉన్నాడనే గీత తన బిడ్డకు.. మద్యం తాగించి, ఎక్కువ భోజనం పెట్టి, పదే పదే పాలు తాగించి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితురాలు గీతను అరెస్టు చేసినట్లు వివరించారు.

Also Read

News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Gold And Silver Price: గోల్డ్‌ లవర్స్‌కి కాస్త ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన సిల్వర్ రేట్స్..

Coronavirus: దేశంలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ ఊహగానాలు.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..