Gold And Silver Price: గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన సిల్వర్ రేట్స్..
Gold And Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 52వేలు దాటేసి రూ. 53 వేల వైపు దూసుకుపోతోంది. అయితే ఆదివారం...
Gold And Silver Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు వారం రోజులుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 52వేలు దాటేసి రూ. 53 వేల వైపు దూసుకుపోతోంది. అయితే ఆదివారం బంగారం ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. ఆదివారం దేశంలో అన్ని నగరాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక వెండి విషయానికొస్తే సిల్వర్ ధరల్లో తగ్గుదుల కనిపించడం గమనార్హం. కిలో వెండిపై ఏకంగా రూ. 1000కి పైగా తగ్గింది. ఆదివారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590గా ఉంది.
* చెన్నై రాజధాని తమిళనాడులోలో మాత్రం బంగారం ధర తగ్గింది ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ. 52,840 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా నమోదైంది.
* విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా ఉంది.
వెండి ధరలు ఇలా ఉన్నాయి..
* న్యూఢిల్లీలో ఆదివారం కిలో వెండి ధర రూ. 68,900 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో కిలో వెండి ధర రూ. 68,900 గా ఉంది.
* హైదరాబాద్‌లో ఆదివారం కిలో వెండి ధర రూ. 73,400 వద్ద ఉంది.
* విజయవాడలో కిలో వెండి ధర ర. 73,400 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,400 గా నమోదైంది.
Also Read: Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి
Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!
Coronavirus: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ఊహగానాలు.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..