AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microsoft: ఒప్పందాల కోసం మైక్రోసాఫ్ట్ ముడుపులు.. సంచలన కామెంట్స్ చేసిన ఆ ఉద్యోగి..!

Microsoft: అమెరికా టెక్ దిగ్గజంపై మరో సంచలన ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో ఒప్పందాల కోసం భారీ స్థాయిలో కంపెనీ ముడుపులు ఇస్తోందని యాసర్‌ ఎలాబ్‌ అనే మాజీ ఉద్యోగి ఆరోపించారు.

Microsoft: ఒప్పందాల కోసం మైక్రోసాఫ్ట్ ముడుపులు.. సంచలన కామెంట్స్ చేసిన ఆ ఉద్యోగి..!
Ayyappa Mamidi
|

Updated on: Mar 27, 2022 | 8:09 AM

Share

Microsoft: అమెరికా టెక్ దిగ్గజంపై మరో సంచలన ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో ఒప్పందాల కోసం భారీ స్థాయిలో కంపెనీ ముడుపులు ఇస్తోందని యాసర్‌ ఎలాబ్‌ అనే మాజీ ఉద్యోగి ఆరోపించారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ రూ. 1.5 వేల కోట్ల రూపాయలను లంచాల( Bribes) రూపంలో ఇచ్చిందని అతడు ప్రజావేగుల వేదికగా మారిన లయనెస్‌ వెబ్‌సైట్‌లో(Linus Website) ఓ వ్యాసం రాశారు. ఘనా, నైజీరియా, జింబాబ్వే, కతార్‌, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఒప్పందాలకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్లు ఎలాబ్‌ తన వ్యాసంలో తెలిపాడు. 1998లో సంస్థలో చేరిన తాను మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో సంస్థ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంపై పనిచేశానన్నారు. ఈ క్రమంలో తన పనితీరును మెచ్చి కంపెనీలో పలు పదోన్నతులు పొందినట్లు పేర్కొన్నారు.

కొంతకాలం గడిచిన తర్వాత సంస్థలో కొంత వింత పోకడను గమనించానని ఎలాబ్‌ తెలిపారు. తన కంటే కింది హోదాలో అనేక మంది ఉద్యోగులు విలాసవంతమైన కార్లు, విల్లాలు కొనుక్కొని జీవితం గడుపుతున్నట్లు గమనించానన్నారు. తాను మాత్రం ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఇల్లు కొనడానికే కష్టపడ్డానని తెలిపారు. 2016లో 40 వేల డాలర్ల మంజూరుకు తనకు ఓ అభ్యర్థన వచ్చిందని తెలిపారు. ఓ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఈ మొత్తం కావాలని కోరినట్లు తెలిపారు. కానీ, కస్టమర్‌కు సంబంధించిన వివరాలు కంపెనీ ‘పొటెన్షియల్‌ క్లయింట్స్‌’ డేటాబేస్‌లో లేవని తెలిపారు. తీరా చూస్తే ఆ క్లయింట్‌ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగేనని తేలిందన్నారు. నాలుగు నెలల క్రితమే అతణ్ని సంస్థ బయటకు పంపిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. కంపెనీ నుంచి బయటకు వెళ్లిన ఉద్యోగులు సంస్థతో ఆరు నెలల వరకు ఎలాంటి భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు.ఈ విషయాన్ని పైస్థాయి వారి దృష్టికి తీసుకెళితే.. 40 వేల డాలర్ల మంజూరును నిలిపివేశారని ఎలాబ్‌ తెలిపారు. కానీ, ఈ దుశ్చర్యకు పాల్పడుతున్న మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులపై మాత్రం ఎలాంటి విచారణకు ఆదేశించలేదని వెల్లడించారు. సీఈఓ సత్య నాదెళ్ల, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఉపాధ్యక్షుడికి కూడా లేఖ రాశానన్నారు. విషయాన్ని నాదెళ్ల దృష్టికి తీసుకెళ్లినందుకు తనపై ప్రతీకార చర్యలు ప్రారంభించారన్నారు. అప్పటి వరకు ‘స్టార్‌ పెర్ఫార్మర్‌’గా ఉన్న తనను ‘పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌’లో చేర్చారని ఆరోపించారు.

అమెరికా సెక్యూరిటీస్ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డుకు కూడా ఈ విషయాన్ని తెలియజేశానన్నారు. అక్కడి నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్నారు. తనతో పాటు మరో ఐదుగురు కూడా మైక్రోసాఫ్ట్‌లో జరుగుతున్న అవినీతి గురించి గళం విప్పగా.. వారందరినీ సంస్థ నుంచి బయటకు పంపేసిందని అతడు తెలిపాడు. ఈ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌ స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీలో ఎలాంటి అనైతిక చర్యలకు అవకాశం ఇవ్వబోమని తెలిపింది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులను అనుమతించబోమని స్పష్టం చేసింది. చట్టవిరుద్ధ కార్యక్రమాలు జరిగితే ఎవరైనా తమ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు కంపెనీలో ఉందని తెలిపింది. ఎలాబ్‌ చేసిన ఆరోపణలు చాలా పాతవని.. వీటిపై ఇప్పటికే విచారణ జరిపి సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి..

E Shram Card: ఈ శ్రమ్‌ కార్డు అప్లై చేశారా.. ఈ బెనిఫిట్స్‌ అస్సలు కోల్పోకండి..!

Telangana: ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చాడు.. పత్తా లేకుండా పోయాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!