E Shram Card: ఈ శ్రమ్‌ కార్డు అప్లై చేశారా.. ఈ బెనిఫిట్స్‌ అస్సలు కోల్పోకండి..!

E Shram Card: దేశంలో కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పేద, బలహీన వర్గాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడానికి అనేక విభిన్న పథకాలను అమలు చేస్తోంది.

E Shram Card: ఈ శ్రమ్‌ కార్డు అప్లై చేశారా.. ఈ బెనిఫిట్స్‌ అస్సలు కోల్పోకండి..!
E Shram Card
Follow us
uppula Raju

|

Updated on: Mar 27, 2022 | 5:51 AM

E Shram Card: దేశంలో కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పేద, బలహీన వర్గాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడానికి అనేక విభిన్న పథకాలను అమలు చేస్తోంది. అందులో ఒకటి ఈ శ్రామిక్‌ కార్డ్‌ స్కీమ్‌. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజల కోసం ఈ పథకాన్ని 2020 డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రారంభించింది. 2020 మార్చి నెలలో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దృష్ట్యా లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో వీధి వ్యాపారులు, గృహ నిర్మాణదారులు, వ్యవసాయ కూలీలు మొదలైన రోజువారీ వేతనాలపై పనిచేసే లక్షలాది మంది కూలీలు నిరుద్యోగులయ్యారు. తరువాత వారందరూ పెద్ద నగరాల నుంచి తమ ఇళ్లకు తిరిగి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో కూలీలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కూలీలకి ఆర్థిక సహాయంతో పాటు బీమా పథకం, ఇల్లు కట్టుకోవడం మొదలైన అనేక ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద ఈ-శ్రమ్ కార్డ్ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2 లక్షల బీమా ప్రయోజనాన్ని కల్పిస్తోంది. ప్రమాదవశాత్తు కూలీ చనిపోతే కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. మరోవైపు ఒక కార్మికుడు ప్రమాదంలో వికలాంగులైతే అటువంటి వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. దీంతో పాటు ప్రభుత్వ ఈ-శ్రమ్ కార్డు పథకం లబ్ధిదారులు వారి సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం పొందుతారు.

కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కూలీల ఖాతాల్లో 500 నుంచి 1000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేస్తోంది. కూలీలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం డబ్బులు అందజేస్తుంది. దీంతో పాటు కార్మికులకు ఉచిత కుట్టు మిషన్లు, సైకిళ్లు, పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లు వంటి అనేక ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీరు ముందుగా దాని అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఒక ఫారమ్ నింపి ఇవ్వాలి. ఇది కాకుండా మీరు పోస్ట్ ఆఫీస్, స్టేట్ సర్వీస్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!

సరికొత్త ప్రేమ కథా చిత్రమ్‌.. 67 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల అబ్బాయి..!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.