పెళ్లికి ముహూర్తం ఖరారైందా.. కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Wedding Insurance: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం వివాహ పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇండియాలో రెండో, మూడో వేవ్ సమయంలో
Wedding Insurance: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం వివాహ పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇండియాలో రెండో, మూడో వేవ్ సమయంలో చాలా మంది తమ వివాహాలని రద్దు చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల లక్షల్లో నష్టపోయారు. ఈ పరిస్థితిలో ప్రజలకు సహాయం చేయడానికి, ఇటువంటి సమస్యలను అధిగమించడానికి బీమా సంస్థలు వివాహ బీమా సౌకర్యాన్ని ప్రారంభించాయి. ఇందులో వివాహం రద్దు కావడం, పెళ్లిలో వస్తువుల దొంగతనం జరగడం, లేదా ఇంకేదైనా నష్టం జరిగినప్పుడు బీమా కంపెనీ పాలసీదారుకు నష్టాన్ని భర్తీ చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.5 కోట్ల వివాహాలు జరుగుతున్నాయి. దీంతో పాటు దేశంలో ఏటా రూ.3.71 లక్షల కోట్లు ఈ పెళ్లిళ్లకు వెచ్చిస్తున్నారు. వివాహాలకి ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. బ్యాండ్‌లు, పెళ్లి వేదికలు, షాపింగ్‌లు మొదలైనవాటికి నెలరోజుల ముందే అన్ని సన్నాహాలు చేసుకుంటారు.
ఇలాంటి కీలక సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వివాహం రద్దు అయితే ప్రజలు లక్షలు, కోట్లలో నష్టపోతారు. ఇలాంటి పరిస్థితిలో వివాహ బీమా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో వివాహ బీమా ట్రెండ్‌లో అంతగా లేదు. అయితే రాబోయే కాలంలో ఇది బాగా వృద్ధిలోకి వస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వివాహ బీమాలో పాలసీ కొనుగోలుదారు మొత్తం వివాహ బడ్జెట్‌లో 1 నుంచి 1.5 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీ వివాహం 20 లక్షల రూపాయలు అయితే మీరు బీమా ప్రీమియంగా 30 వేల రూపాయలు చెల్లించాలి. ఆ తర్వాత మీకు ఏ రకంగానైనా నష్టం జరిగినా పరిహారం పొందుతారు. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జెనరాలి, హెచ్‌డిఎఫ్‌సి ఆగ్రో, ఐసిఐసిఐ లాంబార్డ్ వంటి అనేక బీమా కంపెనీలు ప్రజలకు వివాహ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.