Anil Ambani Resigns: రిలయన్స్‌ పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డు పదవులకు అనిల్‌ అంబానీ రాజీనామా..

Anil Ambani Resigns: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) చైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకి రాజీనామా చేశారు.

Anil Ambani Resigns: రిలయన్స్‌ పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బోర్డు పదవులకు అనిల్‌ అంబానీ రాజీనామా..
Anil Ambani Resigns
Follow us
uppula Raju

|

Updated on: Mar 26, 2022 | 6:00 AM

Anil Ambani Resigns: అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) చైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకి రాజీనామా చేశారు. అంతకుముందు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టెడ్ కంపెనీలలో చేరకుండా అనిల్ అంబానీని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) నిషేధించిన సంగతి తెలిసిందే. సెబీ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి అనిల్ అంబానీ వైదొలిగినట్లు రిలయన్స్ పవర్ స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా “సెబి మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా” కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి అనిల్ అంబానీ రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది. ఫిబ్రవరిలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురిపై డబ్బు విత్‌డ్రా చేశారనే ఆరోపణలపై సెబీ నిషేధం విధించింది. ఆర్-పవర్, ఆర్-ఇన్‌ఫ్రా డైరెక్టర్ల బోర్డు శుక్రవారం రాహుల్ సారిన్‌ను ఐదేళ్లపాటు స్వతంత్ర డైరెక్టర్‌గా అదనపు డైరెక్టర్‌గా నియమించిందని ADAG గ్రూప్ కంపెనీలు తెలిపాయి. అయితే ఈ నియామకం సాధారణ సమావేశంలో సభ్యుల ఆమోదానికి లోబడి ఉంటుంది.

అనిల్ అంబానీ కంపెనీని కొనుగోలు చేసేందుకు గౌతమ్ అదానీ ఆసక్తి.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌పై అప్పుల భారం పడింది. సమాచారం ప్రకారం.. గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కెకెఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్‌తో సహా 14 ప్రధాన కంపెనీలు ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించిన అడ్మినిస్ట్రేటర్ బిడ్‌ల సమర్పణకు చివరి తేదీని మార్చి 11 నుంచి మార్చి 25 వరకు పొడిగించారు. పాలనా లోపం చెల్లింపు డిఫాల్ట్ కారణంగా నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును ఆర్‌బిఐ రద్దు చేసింది. సెప్టెంబర్ 2021లో రిలయన్స్ క్యాపిటల్ తన వార్షిక జనరల్ మీటింగ్‌లో కంపెనీపై మొత్తం రుణం 40 వేల కోట్లు అని వాటాదారులకు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.1759 కోట్లకు తగ్గింది. రిలయన్స్ క్యాపిటల్ 1986 సంవత్సరంలో స్థాపించారు.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..