- Telugu News Photo Gallery Those with oily skin should not apply these skin care products or things in telugu
Oily Skin: ఆయిల్ స్కిన్ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!
Oily Skin: పెట్రోలియం జెల్లీ: దీనిని సాధారణంగా వాసెలిన్ అని పిలుస్తారు. కానీ ఇది ఒక ఉత్పత్తి పేరు. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు పెట్రోలియం జెల్లీని ముఖానికి రాసుకోవడం మంచిదికాదు.
Updated on: Mar 25, 2022 | 10:48 PM

పెట్రోలియం జెల్లీ: దీనిని సాధారణంగా వాసెలిన్ అని పిలుస్తారు. కానీ ఇది ఒక ఉత్పత్తి పేరు. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు పెట్రోలియం జెల్లీని ముఖానికి రాసుకోవడం మంచిదికాదు. ఇది ముఖాన్ని మరింత జిడ్డుగా చేస్తుంది.

వెన్న: చర్మ సంరక్షణలో ఇది ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అయితే చర్మ రకాన్ని బట్టి దీనిని అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది పనికిరాదు. ఇది ఆయిల్‌ని మరింత పెంచుతుంది. ఎండాకాలం అయినా, చలికాలం అయినా ఆయిల్ స్కిన్ ఉన్నవారు దీనిని ముఖానికి రాసుకోకూడదు.

శెనగపిండి: జిడ్డు చర్మం ఉన్నవారు ముఖానికి శెనగపిండి పూయకూడదు. దీని వల్ల చర్మంపై ఎక్కువ మొటిమలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని నేరుగా వర్తించే బదులు కొన్ని ఇతర పదార్ధాలను కలిపి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది.

టోనర్: స్కిన్ కేర్‌లో భాగంగా చాలామంది టోనర్‌ను ఉపయోగిస్తారు. అయితే చర్మ రకాన్ని బట్టి టోనర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఆయిల్ స్కిన్ ఉన్నవారు తప్పు టోనర్‌ని ఉపయోగిస్తే వారి సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

బియ్యం పిండి: ఇది చర్మ సంరక్షణకి మంచిదని భావిస్తారు. ప్రజలు దీనిని స్క్రబ్స్, ఫేస్ ప్యాక్‌ల రూపంలో ముఖానికి అప్లై చేస్తారు. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు బియ్యప్పిండిని వాడకూడదు. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల దద్దుర్లు వస్తాయి.



