AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా నెట్టింట...

Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!
Stunt Fail
Ravi Kiran
|

Updated on: Mar 26, 2022 | 10:05 PM

Share

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా నెట్టింట యువత తనలోని ప్రతిభను చూపించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రకరకాల స్టంట్స్ చేస్తూ.. తమ వీడియోలకు లైకులు, వ్యూస్‌ను పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొందరు సైకిల్‌పై విన్యాసాలు చేస్తే.. మరికొందరు మోటార్‌సైకిల్‌పై ఎత్తైన కొండల మీద ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తారు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఎక్కడ పట్టు తప్పినా.. ప్రాణాలు పోయినట్లే.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటి కోవకు చెందినదే. ఇక్కడ ఓ యువతి స్టంట్ చేయబోయి.. బొక్కబోర్లాపడుతుంది.. మీరూ వీడియో చూస్తే కచ్చితంగా ఆమెపై జాలిపడటం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఒక అమ్మాయి బ్రిడ్జ్ మీద రైలింగ్ అవతల బ్యాక్ ఫ్లిప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అయితే ఆమె ఆ స్టంట్ చేయబోయి.. అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకేముంది పట్టు తప్పి నేరుగా నదిలో పడిపోతుంది. ఆమె నీటిలో పడినదా.? లేదా.? అనేది వీడియోలో చూపించలేదు. అయినప్పటికీ.. ఆమె నీటిలో పడిపోవటం చూస్తే కచ్చితంగా మీరూ జాలిపడతారు.

కాగా, ఈ వీడియోను ‘RunningForever’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అప్‌లోడ్ చేసింది. ఇంతవరకు ఈ వీడియోకు 50 మిలియన్ల వ్యూస్ రాగా.. 1 మిలియన్ కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. ఆ యువతి పరిస్థితి చూసి చాలామంది నెటిజన్లు జాలిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి