Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..

విలక్షణ నటుడు ప్రకష్ రాజ్ (Prakash Raj) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు.

Prakash Raj: పుట్టిన రోజు వేళ ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఇక ఆ బాధ్యత నాదేనంటూ..
Prakash Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2022 | 3:11 PM

విలక్షణ నటుడు ప్రకష్ రాజ్ (Prakash Raj) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) సేవలను.. ఇకపై తన సొంత ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు తెలిపారు… ” నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. పునీత్ రాజ్ కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లబోతున్నాను.. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాను.. ” అంటూ పునీత్ ఫోటోను షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఆ పోస్టర్‏లో అప్పు ఎక్స్‏ప్రెస్ అని రాసి ఉంది. దీంతో పునీత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్‏కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రకాష్ రాజ్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మేజర్.. కేజీఎఫ్ 2, శాకుంతలం.. సర్కారు వారి పాట సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తున్నారు. తెలుగు మాత్రమే కాకుండా.. కన్నడ.. తమిళ్.. మలయాళ చిత్రాల్లోనూ ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అలాగే.. తన పుట్టినరోజు సందర్భంగా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్నారు. షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా.. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది.. ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు.. పెళ్లి రోజున మొక్కలు నాటుతూ పర్యావరణానికి మేలు చేస్తున్నారని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

Also Read: RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం

Pushpa The Rule : సుకుమార్ ప్లాన్ పట్టాలు తప్పుతుందా.. పుష్ప 2 అనుకున్న సమయానికి రాదా..?

The Kashmir Files: వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్‌.. ‘భోపాలీ’కి చెప్పిన అర్ధంపై మండిపడుతున్న ప్రజలు

RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్‌.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..