RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్‌.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..

RRR Movie: నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. రాజమౌళి (Rajamouli) అద్భుత దర్శకత్వం, రామ్‌చరణ్‌ (RamCharan), ఎన్టీఆర్‌ (NTR)ల నటన సినిమాను విజయ తీరాలకు చేర్చింది. విడుదలైన అన్ని చోట్ల...

RRR Movie: ఫ్యామిలీతో కలిసి ట్రిపులార్‌ను వీక్షించిన పుష్పరాజ్‌.. సినిమా విజయంపై ఏమన్నరాంటే..
Rrr Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 26, 2022 | 1:51 PM

RRR Movie: నార్త్‌ నుంచి సౌత్‌ వరకు ఇప్పుడు ఎక్కడ విన్నా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమాకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. రాజమౌళి (Rajamouli) అద్భుత దర్శకత్వం, రామ్‌చరణ్‌ (RamCharan), ఎన్టీఆర్‌ (NTR)ల నటన సినిమాను విజయ తీరాలకు చేర్చింది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా కూడా అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డు దిశగా దూసుకుపోతోందీ సినిమా. సామాన్య ప్రేక్షకుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళితో పాటు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. సినీ సెలబ్రిటీలంతా థియేటర్లకు క్యూకడుతూ సినిమాపై సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్‌ చిరు కుటుంబంతో కలిసి సినిమాను చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ట్రిపులార్‌ సినిమాను వీక్షించారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ థియేటర్లో సినిమాను వీక్షించిన బన్నీ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్‌ చేస్తూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు కంగ్రాట్స్‌. రాజమౌళి గారి విజన్‌ను గౌరవిస్తున్నాను. మా బావ.. రామ్‌ చరణ్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడు’ అంటూ ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, అలియా భట్‌పై ప్రశసంలు వర్షం కురిపించారు. ఇండియన్‌ సినిమా ఖ్యాతిని పెంచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు బన్నీ. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి రోజే ఏకంగా రూ. 150 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా దూసుకుపోతోంది.