AP Assembly: 2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 13వ రోజు కొనసాగాయి. ముందుగా ప్రశ్నోత్నరాలు, అనంతరం పలు రకాల బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాలు..

AP Assembly: 2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన సీఎం వైఎస్‌ జగన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2022 | 2:25 PM

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 13వ రోజు కొనసాగాయి. ముందుగా ప్రశ్నోత్నరాలు, అనంతరం పలు రకాల బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan)మాట్లాడుతూ.. 2022-23 సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. మూడు సంవత్సరాలలో 95 శాతం హామీలు నెరవేర్చామని, కరోనా వచ్చి ఆదాయం తగ్గిందని, అయినా తమ దీక్ష మారలేదని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో టీడీపీకి ఓటు వేసిన వారు ఇప్పుడు మా వెంట ఉన్నారని, అందుకే ప్రతిపక్షం ఉనికి కోసం డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకే ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించార. మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతోందన్నారు.

2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

☛ ఏప్రిల్ – వ‌స‌తి దీవెన‌, వ‌డ్డీ లేని రుణాలు

☛ మే- విద్యా దీవెన‌,రైతు భ‌రోసా,ఖ‌రీఫ్ ఇన్సూరెన్స్,మ‌త్స్య‌కార భ‌రోసా

☛ జూన్ – అమ్మ ఒడి-6500 కోట్లు

☛ జూలై – విద్యాకానుక‌, వాహ‌న‌మిత్ర, కాపు నేస్తం, జ‌గ‌న‌న్న తోడు

☛ ఆగ‌స్ట్ – విద్యా దీవెన‌, నేత‌న్న నేస్తం, ఎంఎస్ ఎంఈల‌కు ప్రోత్సాహ‌కాలు

☛ సెప్టెంబ‌ర్- వైఎస్సార్ చేయూత‌

☛ అక్టోబ‌ర్ – వ‌స‌తి దీవెన‌,రైతు భ‌రోసా రెండో విడ‌త‌

☛ న‌వంబ‌ర్ – విద్యా దీవెన‌,వ‌డ్డీ లేని రుణాలు

☛ డిసెంబ‌ర్ – ఈబీసీ సేస్తం,లా నేస్తం

☛ వచ్చే ఏడాది జ‌న‌వ‌రి – రైతు భ‌రోసా మూడో విడ‌త‌, వైఎస్సార్ ఆస‌రా, జ‌గ‌న‌న్న తోడు,పెన్షన్లు 2500 నుంచి 2750 కు పెంపు

☛ ఫిబ్రవ‌రి – విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న చేదోడు

☛ మార్చి – వ‌స‌తి దీవెన‌

Ap

ఇవి కూడా చదవండి:

Tirumala: తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. క్యూ లైన్లలోని భక్తులకు ఆహారం, పాలు అందించాలని ఆదేశం

Child Marriage: ఆర్థిక అసమానతలు.. అభద్రతా భావాలు.. బాల్యవివాహ సర్వేలో విస్తుపోయే విషయాలు