Tirumala: తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు.. క్యూ లైన్లలోని భక్తులకు ఆహారం, పాలు అందించాలని ఆదేశం
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ (TTD Chairman )వైవి సుబ్బారెడ్డి(YV Subbareddy) శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు..
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ (TTD Chairman )వైవి సుబ్బారెడ్డి(YV Subbareddy) శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. క్యూ లో దర్శనానికి వెళుతున్న భక్తులతో మాట్లాడారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజిఓ బాలిరెడ్డి ని చైర్మన్ ఆదేశించారు.
అంతేకాదు రాంభగీచా బస్టాండ్ బస్టాండు సమీపంలోని అన్న ప్రసాద వితరణ కౌంటర్ ను పరిశీలించారు. భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా, పారిశుధ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సుబ్బారెడ్డి ఆదేశించారు. అనంతరం పి ఎ సి 1 కు వెళ్ళి అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు. గదులు సులువుగా దొరుకుతున్నాయా, దర్శనం ఎలా అయ్యింది.. ఎంత సమయం పట్టింది అని తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ పారిశుధ్యం మరింత మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read:
Tirumala Temple: టీటీడీకి ప్రవాస భక్తుడు భారీ విరాళం.. ఛైర్మన్‌కు డిడి అందజేత