AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: చెర్రీ భార్య ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో హంగామా.. ఉపాసన ఫ్యాన్ గర్ల్‌లా కేరింతలు.. పేపర్స్ వర్షం

Upasana Hungama: ఆర్ఆర్ఆర్ చిత్రం(RRR Movie) తెలుగు రాష్ట్రాలతో సహా దేశవిదేశాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెనిఫిట్స్ షో ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర సినీ నటీనటులతో పాటు..

Upasana Konidela: చెర్రీ భార్య ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో హంగామా.. ఉపాసన ఫ్యాన్ గర్ల్‌లా కేరింతలు.. పేపర్స్ వర్షం
Upasana Hungama Rrr Theatr
Surya Kala
|

Updated on: Mar 25, 2022 | 2:51 PM

Share

Upasana Konidela: ఆర్ఆర్ఆర్ చిత్రం(RRR Movie) తెలుగు రాష్ట్రాలతో సహా దేశవిదేశాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెనిఫిట్స్ షో ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర సినీ నటీనటులతో పాటు అభిమానులు కూడా  హంగామా చేస్తున్నారు. పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీని చిత్ర యూనిట్ కూడా అభిమానులతో కలిసి చూస్తున్నారు. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా కనిపించాడు.

ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి AMB సినిమాస్ లో బెనిఫిట్ షో చూడగా రాజమౌళి, రామ్ చరణ్ భ్రమరాంబ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. రామ్ చరణ్ తో పాటు భార్య ఉపాసన, మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కి వచ్చారు.  అయితే ఈ సినిమాని థియేటర్‌‌లో అభిమానులతో కలిసి చూసి ఫుల్ ఎంజాయ్  చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నంతసేపు చరణ్ భార్య ఉపాసన ఓ చిన్న పిల్లలా సామాన్య అభిమానిలా మారిపోయింది.  థియేటర్లో సినిమా చూస్తూ అభిమానులతో పాటు ఉపాసన కూడా స్క్రీన్ పై రామ్ చరణ్ సన్నివేశాలు వచ్చినప్పుడు పేపర్ల ముక్కలను ఎగురవేస్తూ హంగామా చేసింది.

సామాన్య ఫ్యాన్ గర్ల్ లా మారిన ఉపాసనా కేరింతలు కొడుతూ.. అరుస్తూ, పేపర్లు చింపుతూ, వాటిని గాల్లోకి ఎగరేస్తూ రచ్చ  రచ్చ చేసింది. అదే సమయంలో తన వెనుక వరసలో కూర్చున్న చరణ్ పై కూడా పేపర్స్ విసురుతూ హడావిడి చేసింది. ఉపాసన చేస్తున్న హంగామాని ఎవరో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర నయా కల్చర్.. హాల్ దగ్గర అభిమాని గన్‌తో హల్ చల్

అరటిపండ్ల మాటున అక్రమ రవాణా.. పుష్ప సినిమాను తలపించే సీన్.. అవాక్కైన పోలీసులు