పంటకు వచ్చిన అరటిపండ్ల లోడ్ అనుకునేరు.. అసలు పత్తి వ్యాపారం తెలిస్తే నివ్వెరపోతారు
బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్(Smuggling) మెయిన్ లీడ్ తో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లను కొందరు..
బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్(Smuggling) మెయిన్ లీడ్ తో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లను కొందరు కాపీ కొడుతున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాలో పాల వ్యాన్ లో ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు నిజ జీవితంలోనూ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వాటర్ ట్యాంకుల్లో ఎర్రచందనం, అంబులెన్స్‌లో గంజాయి తరలింపు వంటి ఘటనలు మనం చూశాం. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అరటిపళ్ల లారీలో(Banana Truck) గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గ్వాలియర్ – చంబల్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు తనిఖీలు చేపట్టి భారీగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి యూపీ(Uttar Pradesh) కి సరకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. అరటి పళ్ల మధ్య గంజాయి బస్తాలను ఉంచి లారీలో తరలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు సుమారు 9 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే ముఠా నాయకుడు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ కు అరటి పండ్లు తరలిస్తున్నామని స్మగ్లర్లు చెప్పారు. ట్రక్కులో 25 క్వింటాళ్ల అరటి పళ్లు ఉన్నాయని బిల్లులు చూపించారు. కానీ ఆ ట్రక్కులో 15 క్వింటాళ్ల అరటి పళ్లు మాత్రమే ఉన్నాయి. మిగతా 9 క్వింటాళ్ల గంజాయిని సంచుల్లో ప్యాక్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా అరటి పళ్ల మధ్యన ఉంచారు. గంజాయి వాసన రాకుండా ఉండేందుకు ఆ బస్తాలపై పర్‌ఫ్యూమ్‌ని చల్లారు. సాధారణ తనిఖీలు చేస్తే వాటిని గుర్తుపట్టడం కష్టమే. కానీ ఇన్‌ఫార్మర్ ద్వారా కచ్చితమైన సమాచారం అందడంతోనే పోలీసులు రంగంలోకి దిగి స్మగ్లర్లను పట్టుకున్నారు.
Also Read
Viral Video: అర్డర్ చేసిన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేసిన డెలివరీ బాయ్.. అదెలా బయటపడిందంటే..?
AP Crime: కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. గంజాయి స్మగ్లర్ గా మారాడు.. చివరికి