Ram Gopal Varma: ఎవరికీ భయపడని గ్యాంగ్‌స్టర్‌ను పరిచయం చేసిన వర్మ.. ఉపేంద్ర సినిమా టైటిల్ ఏంటో తెలుసా.?
Ram Gopal Varma: జయాపజయాలకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే డేంజరస్, కొండ సినిమాలను పూర్తి చేసిన వర్మ తాజాగా మరో కొత్త సినిమాను మొదలు పెట్టారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ఓ సినిమా చేస్తున్మట్లు వర్మ గతంలోనే...
Ram Gopal Varma: జయాపజయాలకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే డేంజరస్, కొండ సినిమాలను పూర్తి చేసిన వర్మ తాజాగా మరో కొత్త సినిమాను మొదలు పెట్టారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ఓ సినిమా చేస్తున్మట్లు వర్మ గతంలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాడు వర్మ. ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వర్మ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. మాఫియా చిత్రాలకు మారుపేరైన వర్మ మరోసారి అదే ఫార్మూలతో సినిమాతో చేయనున్నాడు.
‘R’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వర్మ ప్రకటించాడు. టైటిల్‌ను రివీల్ చేస్తూ రూపొందించిన ఓ వీడియోను పోస్ట్ చేసిన వర్మ.. ‘ప్రపంచంలో ఎవరికీ భయపడి ఓ గ్యాంగ్‌స్టర్ కథ. అలాగే ఇండియాలో మోస్ట్ సక్సెఫ్ ఫుల్ గ్యాంగ్‌స్టర్’ అంటూ క్యాప్షన్ జోడించాడు వర్మ. బెంగళూరు కేంద్రంగా సంచలనం సృష్టించిన ‘R’ గ్యాంగ్ నేపథ్యంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాను స్క్వేర్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. ఇంతకీ వర్మ ఈ సినిమాతో ఏ గ్యాంగ్‌స్టర్ జీవిత కథను చూపించనున్నాడని. ఈ సినిమా ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.
R played by @nimmaupendra was a daredevil gangster who was not scared of anyone in the world and the most successful of all the gangsters in india pic.twitter.com/6VMtDTHIls
— Ram Gopal Varma (@RGVzoomin) March 24, 2022
Vijay devarakonda: విజయ్, సమంత సినిమాపై క్రేజీ అప్‌డేట్.. అలనాటి సూపర్ హిట్ చిత్రం ఇతివృత్తంతో.?
Leopard vs Phone: ఫోన్ కాపాడిన ప్రాణం.. దెబ్బకు పరుగులు తీసిన చిరుతపులి.. పూర్తివివరాలివే..!