Leopard vs Phone: ఫోన్ కాపాడిన ప్రాణం.. దెబ్బకు పరుగులు తీసిన చిరుతపులి.. పూర్తివివరాలివే..!
Leopard vs Phone: ప్రస్తుత కాలంలో ఫోన్‌తో ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ.. అంతా నెగిటివ్ టాక్ మాత్రమే వినిపిస్తుంది.
Leopard vs Phone: ప్రస్తుత కాలంలో ఫోన్‌తో ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ.. అంతా నెగిటివ్ టాక్ మాత్రమే వినిపిస్తుంది. ఫోన్ కారణంగా అది జరిగిపోతోంది. ఇది అయిపోతుందంటూ అంటుంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి నిండు ప్రాణాలను కాపాడింది స్మార్ట్ ఫోన్. అవును.. చిరుత చేతిలో బలిపోయే వ్యక్తి ఒక సెల్‌ఫోన్ కాపాడింది. వివరాల్లోకెళితే.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ కంకావలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రాపూర్‌లోని కంకావలి భిర్వాండేలో మార్కెట్ నుండి తిరిగి వస్తున్న వ్యక్తిపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. చిరుత దాడిలో ఆ వ్యక్తి తల, కళ్లు, కుడిచేతికి తీవ్ర గాయాలయ్యాయి.
అయినప్పటికీ బెదిరిపోకుండా.. చిరుతతో పోరాడాడు ఆ వ్యక్తి. దానితో తీవ్రంగా తలపడ్డాడు. అయినా చిరుత వెనక్కి తగ్గలేదు. చివరకు తన జేబులోని మొబైల్ ఫోన్‌తో చిరుత తలపై గట్టిగా కొట్టాడు. దెబ్బకు బెదిరిపోయిన చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. అలా ఫోన్ అతని ప్రాణాలను కాపాడింది. అయితే, చిరుత పేరు వింటేనే హడలిపోయే స్థితిలో.. ఈ వ్యక్తి ఏకంగా చిరుతతో పోరాడి ప్రాణాలతో బయటపడటం అతని ధైర్యసాహసాలకు నిదర్శనం అని కొనియాడారుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also read:
Viral News: మహిళపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలిస్తే ప్యూజులు ఎగిరిపోతాయి..!
Viral News: గూగుల్ మ్యాప్స్‌లో వింత పర్వతం.. ఏంటా చూస్తే పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి..!