Hijab in Board Exams: హిజాబ్ కు బోర్డు పరీక్షల్లో అనుమతి లేదు.. కర్ణాటక మంత్రి వివరణ
హిజాబ్ (Hijab) వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్ధినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి లేదని కర్ణాటక(Karnataka) మంత్రి బీసీ నగేష్ అన్నారు. హిజాబ్‌పై నిషేధాన్ని...
హిజాబ్ (Hijab) వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్ధినులు హిజాబ్ ధరించేందుకు అనుమతి లేదని కర్ణాటక(Karnataka) మంత్రి బీసీ నగేష్ అన్నారు. హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అందరూ పాటించి పరీక్షకు హాజరు కావాలన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సడలింపులు ఉండవని తెలిపారు. విద్యార్థులు హైకోర్టు (HIgh Court) తీర్పును పాటించాలన్న ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్.. హిజాబ్‌లతో పరీక్ష రాసేందుకు వచ్చేవారిని అనుమతించమని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి చాలా మంది ముస్లిం విద్యార్థులను సందిగ్ధంలో పడేసిందన్నారు. మరోవైపు హిజాబ్ పై నిషేధం విధిస్తే తాము బోర్డు పరీక్షలకు దూరమవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశాన్ని సంచలనం చేయవద్దని సుప్రీంకోర్టు విద్యార్థులను కోరింది. హిజాబ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేసేందుకు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుల్లో నిరాకరించింది. హిజాబ్ ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న సర్కారు ఆదేశాన్ని సమర్థించింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లు హేతుబద్ధంగా లేవంటూ కొట్టేసింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను విద్యాసంస్థల్లోకి అనుమతించడం లేదు. హిజాబ్ నిషేధాన్ని సమర్థించినప్పటి నుంచి చాలా మంది విద్యార్థినులు పాఠశాలలు, కళాశాలల నుంచి తప్పుకున్నారు. కర్ణాటకలోని ఓ ప్రభుత్వ కళాశాలలో తరగతి గదిలో హిజాబ్ ధరించడాన్ని నిరాకరించడంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై 8 మంది ముస్లిం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. తరువాత చాలా కాలేజీల్లో ఈ వివాదం మొదలైంది. ఈమధ్య ఓ కాలేజీలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను విడిగా కూర్చోబెట్టారు. ఈ విషయంపై నిరంతర నిరసనలు కొనసాగుతున్నాయి.
Also Read
Road Accident: ఫ్యాన్స్ బెన్‌ఫిట్ షోకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అభిమానుల దుర్మరణం
Viral Video: నూడుల్స్ సూప్‌లో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుని తింటోన్న కస్టమర్లు.. ఎక్కడంటే..